తెలంగాణ

telangana

ETV Bharat / international

యూనివర్సిటీలో నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ! - Bulgaria high-quality banknotes university

బల్గేరియాలోని ఓ యూనివర్సిటీలో భారీగా నకిలీ నోట్లను గుర్తించారు అధికారులు. అత్యుత్తమ నాణ్యతతో డాలర్, యూరో కరెన్సీని ముద్రించినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Fake money produced at Bulgaria university seized
యూనివర్సిటీలో హైక్వాలిటీ నకిలీ నోట్ల ముద్రణ!

By

Published : Mar 17, 2021, 2:53 PM IST

బల్గేరియా రాజధాని సోఫియాలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు చేశారు ఆ దేశ భద్రతా సిబ్బంది. హైక్వాలిటీ బ్యాంకు నోట్లను ఈ ముఠా ముద్రిస్తోందని అధికారులు గుర్తించారు. ఓ యూనివర్సిటీలోని ప్రింటింగ్ ప్రెస్​లో ఈ కరెన్సీని ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.

యూనివర్సిటీలో నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ!
నకిలీ నోట్లు ప్రింటింగ్ చేస్తున్న ప్రాంతం

అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగంతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఈ తతంగాన్ని గుర్తించారు బల్గేరియా పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముద్రణా యంత్రాలతో పాటు, ప్రింటింగ్​కు ఉపయోగించే ఇతర పరికరాలను సీజ్ చేశారు. భారీ స్థాయిలో డాలర్, యూరో కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

భారీ స్థాయిలో నకిలీ డాలర్లు

"సీజ్ చేసిన కరెన్సీ విలువ భారీగా ఉంది. 4 మిలియన్ డాలర్ల అమెరికా కరెన్సీ, 3.6 మిలియన్ యూరో(సుమారు 4.2 మిలియన్ డాలర్లు) కరెన్సీని మేం స్వాధీనం చేసుకున్నాం. దీన్ని బట్టి చూస్తే క్రిమినల్ కార్యకలాపాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమవుతోంది."

-జార్జీ హాడ్జీవ్, సోఫియా పోలీసు ఉన్నతాధికారి

అరెస్టైన ఇద్దరు నిందితులు భారీ కుట్రలో భాగస్థులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ డాలర్లను ఉక్రెయిన్​కు, నకిలీ యూరోలను పశ్చిమ ఐరోపాకు తరలించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు.

ప్రింటింగ్ యంత్రంలో ఉపయోగించే షీట్లు
నకిలీ యూరోలు

ఇదీ చదవండి:కుప్పకూలిన మిగ్​-21 విమానం- పైలట్ మృతి

ABOUT THE AUTHOR

...view details