తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరోపా​​లో ఫేస్​బుక్​, గూగుల్​పై పెరిగిన ఒత్తిడి

దిగ్గజ సంస్థలు ఫేస్​బుక్​, గూగుల్​పై ఒత్తిడి తీవ్రం చేసింది ఐరోపా సమాఖ్య. తమ సైట్ల నుంచి తీవ్రవాద భావజాలం, చిన్నారుల అసభ్యకర సమాచారాన్ని తొలగించాలని కోరింది. గడువు ముగిసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఓ నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది.

ఫేస్​బుక్, గూగుల్

By

Published : Apr 10, 2019, 8:30 AM IST

ఐరోపా దేశాలు తీసుకొచ్చిన కఠిన నిబంధనలతో... ఫేస్​బుక్, గూగుల్​ సంస్థలపై ఒత్తిడి పెరిగింది. చిన్నారుల అశ్లీల చిత్రాలు, ఉగ్రవాద సంబంధిత సమాచారం తొలగించాలనే నిబంధనలున్న బిల్లుకు ఐరోపా సమాఖ్య పార్లమెంటరీ కమిటీ ఇటీవల ఆమోదం తెలిపింది.

దీన్ని అమలు చేయకుంటే సంస్థల ప్రతినిధులను అరెస్ట్ చేయటం మొదలు ఏకంగా సంస్థను మూసివేసే స్థాయిలో శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించింది.

సామాజిక మాధ్యమాల్లో తీవ్రవాద సంబంధిత సమాచారం తొలగించేందుకు ఒక గంట సమయం ఇచ్చింది. ఆయా సైట్లలో ఉన్న అసభ్యకర వివరాల​నూ పూర్తిగా తొలగించాలని సూచించింది.

సంబంధిత సమాచారాన్ని గుర్తించేందుకు ఓ ప్రత్యేక నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది సమాఖ్య​.

గడువు తర్వాత వెబ్​సైట్లలో ఏమైనా తీవ్రవాద సంబంధ సమాచారాన్ని గుర్తిస్తే... నిర్వాహకులకు భారీ జరిమానా విధించడం సహా కంపెనీని నిషేధించడం వంటి చర్యలు చేపట్టనుంది ఈ నిఘా యంత్రాంగం.

ఈ నేపథ్యంలో గూగుల్, ఫేస్​బుక్​ వంటి పెద్ద సంస్థలు భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. చిన్న కంపెనీలకు మాత్రం వాటిలో అసభ్య కంటెంట్​ను తొలగించేందుకు 12 గంటల సమయం ఇచ్చింది.

గత నెల 15న న్యూజిలాండ్​లోని ఓ మసీదులో జరిగిన ఉగ్రదాడిని... దుండగుడు ఫేస్​బుక్​ లైవ్​లో ప్రసారం చేశాడు. ఈ నేపథ్యంలో మాధ్యమాల నియంత్రణపై బ్రిటన్ దృష్టి సారించింది.

అయితే ఉగ్రదాడి జరిగిన 24 గంటల్లో 1.5 మిలియన్ల వీడియోలు తొలగించినట్లు ఫేస్​బుక్​ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details