తెలంగాణ

telangana

ETV Bharat / international

స్విస్​లో అమెరికా, రష్యా అధ్యక్షుల భేటీ - బైడెన్​, పుతిన్​ భేటీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. రష్యా అధ్యక్షుడు పుతిన్​తో జెనీవాలో భేటీ అయ్యారు. సైబర్​ దాడులు, వాతావరణ మార్పులు సహా పలు వివాదాస్పద అంశాల మీద సుదీర్ఘంగా చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల బంధాలు బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Biden and Putin meet, Biden and Putin in summit
స్విస్​లో అమెరికా, రష్యా అధ్యక్షుల భేటీ

By

Published : Jun 16, 2021, 5:47 PM IST

Updated : Jun 16, 2021, 6:50 PM IST

స్విట్జర్లాండ్​ రాజధాని జెనీవా వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​లు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమవేశం సందర్భంగా వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ భేటీలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కూడా పాల్గొన్నారు.

స్థానికంగా ఉన్న ఓ సరస్సు ఒడ్డున ఉన్న విల్లాలో ఇరు దేశాల అధ్యక్షుల భేటీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత బైడెన్​, పుతిన్​ భేటీ అవుతున్నారు. అంతకుముందు వీరిద్దరూ కలిసిన సమయంలో బైడెన్​ ఉపాధ్యక్షుడిగా, పుతిన్​ ప్రధానిగా కొనసాగుతున్నారు.

చర్చల్లో బైడెన్​, పుతిన్​

దేనిపై చర్చలు?

అమెరికాపై ఇటీవల జరిగిన సైబర్​ దాడులపై బైడెన్ ప్రస్తావించే అవకాశం ఉంది. దీనితో పాటు వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి మొదలైన అంశాలపైన చర్చించనున్నారు. వివాదాస్పద అంశాలైన ఇరాన్​ న్యూక్లియర్​ ప్రోగ్రామ్ సహా అఫ్గానిస్థాన్​, లిబియా, ఉక్రేయిన్​, సిరియా దేశ పరిస్థితులపై కూడా ఇరు దేశాల అధ్యక్షులు చర్చించనున్నారు.

అంతకుముందు.. ఈ భేటీపై రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల బంధాలు బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఈ చర్చల నుంచి మెరుగైన ఫలితాలు ఆశించలేమని వ్యాఖ్యానించారు.

​ఇదీ చదవండి :బైడెన్​కు చైనా స్ట్రాంగ్​ వార్నింగ్!

Last Updated : Jun 16, 2021, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details