Exoplanet GJ367: కొత్త ఎక్సో ప్లానెట్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని పేరు జీజే367బి. ఇది ఇప్పటివరకు కనిపెట్టిన 5000 ఎక్సో ప్లానెట్లలో తేలికైంది. సౌర కుటుంబాలు ఆవల ఉండే గ్రహాలను ఎక్సో ప్లానెట్స్ అని పిలుస్తారు. ఇవి నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తాయి.
సాధారణంగా సూర్యుడి చుట్టూ తిరగడానికి భూమికి 365 రోజులు పడుతుంది. కొత్తగా కనిపెట్టిన ఈ గ్రహం మాత్రం తన మాతృ నక్షత్రం చుట్టూ 8 గంటల్లోనే పరిభ్రమణాన్ని పూర్తిచేస్తుంది. ఈ లెక్కన అక్కడ సంవత్సరమంటే. మనకు 8 గంటలేనన్న మాట! అంగారకుడి కంటే ఇది కాస్త పెద్దది. ఉష్ణోగ్రత 1500 డిగ్రీల సెల్సియస్‌వరకు ఉంటుంది. ఈ వాతావరణంలో కఠినమైన లోహాలు కూడా ఇట్టే కరిగిపోతాయి.