తెలంగాణ

telangana

ETV Bharat / international

పెంపుడు జంతువులకూ కరోనా వ్యాప్తి! - coronavirus updates

శునకాలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకూ కరోనా సోకుతుందని తెలిపారు బ్రిటన్​ శాస్త్రవేత్తలు. కరోనా రోగుల ఇళ్లలో ఉండే 500 జంతువులపై పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ విషయాలు వెల్లడించారు. కొవిడ్​పై పోరాడే యాంటీబాడీలు వాటి శరీరంలో ఉన్నట్లు గుర్తించారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు లేవని చెప్పారు.

Evidence of SARS-CoV-2 exposure found in household cats, dogs in Italy
పెంపుడు జంతువులకూ కరోనా వైరస్​ వ్యాప్తి!

By

Published : Jul 28, 2020, 6:29 PM IST

బ్రిటన్​ శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని వెల్లడించారు. పెంపుడు జంతువులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నాయని తెలిపారు.

ఉత్తర ఇటలీలో కొందరి ఇళ్లలోని 500 శునకాలు, పిల్లుల నమూనాలు సేకరించారు పరిశోధకులు. వాటికి కొవిడ్​ పీసీర్ పరీక్షలు నిర్వహించారు. అన్నింటికీ నెగిటివ్ వచ్చింది. కానీ 3.4 శాతం శునకాలు, 3.9 శాతం పిల్లులలో ​కొవిడ్​పై పోరాడే యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు లివర్​పూల్ యూనివర్సిటీ సహా ఇతర శాస్త్రవేత్తలు గుర్తించారు.

కరోనా సోకిన వారి ఇళ్లలోని పెంపుడు జంతువులకే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం అధికంగా ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు. వైరస్​ లేని వారి ఇళ్లలోని జంతువుల్లో ఎలాంటి ఆనవాళ్లు లేవని చెప్పారు. ఈ అధ్యయనం ఇంకా పూర్తికాలేదు. పరిశోధనకు సంబంధించి ముందస్తు వివరాలు మాత్రమే ప్రచురితమయ్యాయి.

అయితే పెంపుడు జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందని రుజువు చేసేలా ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని తెలిపారు పరిశోధనలో పాల్గొన్న లివర్​పూల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలన్ ర్యాడ్​ఫోర్డ్. కొవిడ్​ రోగుల నుంచి మాత్రం పెంపుడు జంతువులకు వైరస్​ సోకుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఒక్కసారి సోకిన వారికి కరోనా మళ్లీ వస్తుందా?

ABOUT THE AUTHOR

...view details