ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ అలంకరణలతో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ ధగధగ మెరిసిపోతోంది. 10.8 మిలియన్ల విద్యుత్ దీపాలతో నగరాన్ని సుందరంగా అలంకరించారు. స్పానిష్ జెండా రంగులను పోలిన విద్యుత్ కాంతులతో వీధులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పలు వీధుల్లో పెద్ద పెద్ద సెట్టింగ్‌లను ఏర్పాటు చేశారు. గ్రాన్ వయా కూడలిలో 12 మీటర్ల పెద్ద బుడగను క్రిస్మస్ చిత్రాలతో రూపొందించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్.. క్రిస్మస్ సందర్భంగా దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పారిస్‌లో క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన నిర్మాణాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.