ఐరోపా సమాఖ్యలో (ఈయూ) అందరికీ సరిపడా టీకాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లియోన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. ఈయూలోని వివిధ దేశాల ప్రజలు టీకాలు తీసుకుంటున్న వీడియోను ఈ ట్వీట్‌కు జత చేశారు.
"ఈరోజు తొలి యూరోపియన్లు కొవిడ్ టీకా తీసుకుంటున్నారు. మాడ్రిడ్ నుంచి పారిస్ వరకు, అథెన్స్ నుంచి రిగా వరకు.. ఐరోపా సమాఖ్య వ్యాప్తంగా అందరూ వ్యాక్సిన్లు తీసుకోవడం సంతోషంగా ఉంది.
ముందు కొవిడ్‌కు ఎక్కువ ప్రభావితం అయ్యే వారిని రక్షిద్దాం. త్వరలో మనందరికీ సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి."