తెలంగాణ

telangana

ETV Bharat / international

యురోపియన్​ పార్లమెంట్​ ప్రెసిడెంట్​ డేవిడ్​ సస్సోలీ కన్నుమూత - యురోపియన్​ పార్లమెంట్​ ప్రెసిడెంట్​ డేవిడ్​ సస్సోలీ కన్నుమూత

European Parliament President: యురోపియన్​ పార్లమెంట్​ ప్రెసిడెంట్​ డేవిడ్​ సస్సోలీ మంగళవారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన ప్రతినిధి ప్రకటించారు.

European Parliament President
యురోపియన్​ పార్లమెంట్​ ప్రెసిడెంట్​ డేవిడ్​ సస్సోలీ

By

Published : Jan 11, 2022, 11:56 AM IST

European Parliament President: యురోపియన్​ పార్లమెంట్​ అధ్యక్షుడు డేవిడ్​ సస్సోలీ(65) మంగళవారం కన్నుమూశారు. ఇటలీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన ప్రతినిధి రోబెర్టో క్యూల్లో ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

"ఇటలీలోని అవియానోలో.. మంగళవారం తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో డేవిడ్​ సస్సోలీ కన్నుమూశారు. "

-రోబెర్టో క్యూల్లో

రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని తీవ్ర అనారోగ్యానికి గురైన డేవిడ్​.. 2021, డిసెంబర్​ 26న ఆసుపత్రిలో చేరారు. రెండు వారాలకుపైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.

2009లో తొలిసారి యురోపియన్​ పార్లమంట్​కు ఎన్నికయ్యారు సస్సోలీ. మరోమారు 2014లో గెలుపొందిన తర్వాత పార్లమెంట్​ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. ఈ నెలలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పార్లమెంట్​ సభ్యులు నిర్ణయించిన క్రమంలో ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు సస్సోలీ.

ఫ్రాన్స్​లోని స్ట్రాస్​బోర్గ్​లో యురోపియన్​ పార్లమెంట్​ ప్రధానకార్యాలయం ఉంది. యురోపియన్​ యూనియన్​ పార్లమెంట్​.. 450 మిలియన్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. సభ్య దేశాలు 700మంది సభ్యులను ఎన్నుకుంటాయి.

ఇదీ చూడండి:

యునెస్కో వెబ్​సైట్​లో 'హిందీ'.. భారత్​కు అరుదైన గౌరవం

ABOUT THE AUTHOR

...view details