తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా కోరల్లోనే ఐరోపా దేశాలు-ఆర్థిక వ్యవస్థ పతనం - us unemployment news

ఐరోపా సమాఖ్య ఇంకా కరోనా కోరల్లోనే చిక్కుకుని ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి తెలిపారు. ఆ దేశాల్లోని దాదాపు నాలుగింట మూడొంతుల ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేస్తున్న నేపథ్యంలో వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదని హెచ్చరించారు. కరోనా సంక్షోభం వల్ల ఐరోపా ఆర్థివ వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది.

european-economy
కరోనా కోరల్లోనే ఐరోపా దేశాలు-ఆర్థిక వ్యవస్థ పతనం

By

Published : Apr 30, 2020, 7:33 PM IST

కరోనా మహమ్మారి కారణంగా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది ఐరోపా దేశాలే. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుతున్నందున నాలుగింట మూడొంతుల ప్రాంతాల్లో లాక్​డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తున్నారు. అయితే ఐరోపా దేశాల్లో కరోనా వైరస్​ ఇంకా పూర్తిగా కట్టడి కాలేదన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఐరోపా సమాఖ్య అధికారి డాక్టర్​ హ్యాన్స్ కుర్గ్​. భౌతిక దూరం వంటి నియంత్రణ చర్యల వల్ల వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ ఇటలీ, స్పెయిన్​, బ్రిటన్​, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఇంకా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నట్లు తెలిపారు.

ఐరోపా ప్రాంతంలోని 44 దేశాల్లో దేశీయంగా ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు తెలిపారు కుర్గ్​. వాటిలో 21 దేశాల్లో అంక్షలు సడలిస్తున్నట్లు మరో 11 దేశాలు ఇదే బాటలో ఉన్నట్లు చెప్పారు​. కరోనాపై పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పట్లో కరోనా ప్రభావం తగ్గే సూచనలు లేవన్నారు.

ఆర్థిక వ్యవస్థ పతనం..

కరోనా సంక్షోభం కారణంగా ఐరోపా సమాఖ్య ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది. వ్యాపార కార్యకలాపాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, భవన నిర్మాణాలు మూతపడ్డ కారణంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 3.8 శాతం తగ్గుదల నమోదైంది. ఆర్థిక గణాంకాలు పరిశీలిచడం 1995 లో మొదలైన తర్వాత ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం 2009లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయం నాటి పరిస్థితులు తలెత్తాయి. అప్పట్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ 4.8శాతం పతనమైంది.

నిరుద్యోగం గణనీయం..

కరోనా కారణంగా ఐరోపాలో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఫిబ్రవరిలో 7.3 శాతం నిరుద్యోగం ఉండగా మార్చిలో 7.4 శాతానికి పెరిగింది. ప్రైవేటు సంస్థలు సిబ్బందిని తొలగించకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యల ద్వారా ఈ సంఖ్య ఇంకా తగ్గింది.

ఫ్రాన్స్​ ఆర్థిక వ్యవస్థ 1949 తర్వాత ఈ ఏడాదే రికార్డు స్థాయిలో 5.8 శాతం పతనమైంది.

అమెరికాలో రికార్డు

కరోనాతో అతలాకుతులం అవుతున్న అగ్రరాజ్యంలో నిరుద్యోగ శాతం రికార్డు స్థాయిలో నమోదైంది. ఫిబ్రవరిలో 3.5 శాతంగా ఉండగా, మార్చిలో 4.4కి పెరిగింది. ఏప్రిల్​లో మొదటి మూడు వారాల్లోనే దాదాపు 26మిలియన్ల మంది నిరుద్యోగ భృతి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details