ఐరోపా సమాఖ్య(ఈయూ), బ్రిటన్ ఉన్నతాధికారులు..నార్తన్ ఐర్లాండ్లోవాణిజ్య నియమాలపై జరిపిన చర్చల్లో విఫలమయ్యారు. తద్వారా.. రానున్న రోజుల్లోనూ ఈ అంశంపై చర్చలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ మేరకు ఐరోపా కమిషన్ ఉపాధ్యక్షుడు మారోస్ సఫ్కోవిక్, బ్రిటన్ బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్ ఫ్రోస్ట్ గురువారం సాయంత్రం సమావేశమయ్యారు.
బ్రెగ్జిట్ ఒప్పందంలో నిబంధనలు బ్రిటన్ గౌరవించటం లేదని, అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తోందనే ఆరోపణలతో ఈయూ న్యాయ చర్యలు చేపట్టిన నెలరోజుల తర్వాత ఈయూ, బ్రిటన్ ఉన్నతాధికారుల మధ్య ఈ భేటీ జరగటం గమనార్హం. అయితే.. నార్తన్ ఐర్లాండ్లో వాణిజ్య నియమాలకు సంబంధించి రాబోయే వారాల్లో జరిగే చర్చల్లో తాము ఏకాభిప్రాయానికి వస్తామని డేవిడ్ ఫ్రోస్ట్ పేర్కొన్నారు.
అసలేంటి సమస్య..