తెలంగాణ

telangana

ETV Bharat / international

Pfizer Vaccine: ఐరోపాలో చిన్నపిల్లలకు ఫైజర్​ వ్యాక్సిన్​

pfizer vaccine for kids : 5 నుంచి 11 ఏళ్లు ఉండే చిన్న పిల్లలకు ఫైజర్​ టీకాను ఇవ్వాలని ఐరోపా సమాఖ్య నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్​ అంతకంతకూ విస్తరిస్తుండటం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

COVID vaccine for kids, Pfizer
ఐరోపాలో చిన్నపిల్లలకు ఫైజర్​ వ్యాక్సిన్​

By

Published : Nov 25, 2021, 7:04 PM IST

pfizer vaccine for kids: ఐరోపాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఐరోపా సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు ఫైజర్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు అంగీకరించింది(European Union Vaccine Approval) . ఈ మేరకు డ్రగ్‌ రెగ్యులేటర్​ అధికారులు తీసుకున్న నిర్ణయంతో లక్షలాది మంది పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.

ఐరోపా అంతటా కరోనా మహమ్మారి మరోమారు వ్యాపిస్తున్న నేపథ్యంలో పిల్లలకు ఫైజర్‌ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి రావడం ఊరట కలిగించే విషయం. చిన్నపిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు యురోపియన్‌ మెడిసిన్స్ ఏజెన్సీ అనుమతించడం ఇదే మొదటిసారి.

జర్మనీలో లక్ష దాటిని కొవిడ్​ మరణాలు..

Germany covid deaths: జర్మనీలో తాజాగా మరో 351 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో జర్మనీలో కరోనా మరణాలు లక్ష దాటాయి. ప్రస్తుతం మొత్తం మరణాలు సంఖ్య 1,00,119గా ఉంది. ఐరోపా దేశాల్లో లక్షకుపైగా మరణాలు నమోదు చేసిన 5వ దేశంగా జర్మనీ నిలిచింది.

ఇదీ చూడండి:దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం

ABOUT THE AUTHOR

...view details