2050లోగా కర్బన ఉద్గారాలను కనీసం 55శాతం తగ్గించాలన్న ప్రతిపాదనపై ఐరోపా యూనియన్ ప్రాథమికంగా ఏకాభిప్రాయానికి వచ్చింది. వాతావరణ మార్పులపై తర్వలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో.. ఈయూ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
మంగళవారం రాత్రి ఈయూ సభ్యులు చర్చించిన అనంతరం వారు ప్రాథమిక అంగీకారానికి వచ్చారు. 1990తో పోలిస్తే.. 2050నాటికి కర్బన ఉద్గారాల్ని 55శాతం తగ్గించాలన్న ప్రతిపాదనకు ఈయూ కట్టుబడి ఉంది.
"2050వరకల్లా కర్బన ఉద్గారాల్ని తగ్గించాలన్నది మా తొలి ప్రాధాన్యం. మా ఈ నిర్ణయం ఈయూను తరతరాల వరకు గొప్ప స్థానంలో ఉంచుతుంది."