ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగాఅనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ టీకా.. రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది.
ఆస్ట్రాజెనెకా టీకా.. కరోనా వల్ల ఎదురయ్యే ప్రమదాల నుంచి రక్షణ కల్పిస్తుందని తాము నమ్ముతున్నట్లు ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థ అధిపతి ఎమర్ కుకీ తెలిపారు. కానీ, దీనిపై ఇంకా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. టీకాపై ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారంపై చర్చించడానికి ఈ వారంలో నిపుణులు సమావేశమవుతున్నారని పేర్కొన్నారు.
'వ్యాక్సిన్ సేఫ్'
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమైందని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తెలిపారు. కరోనాను ఎదుర్కోవడంలో ఈ టీకా సమర్థవంతంగా పని చేస్తుందని పేర్కొన్నారు. అమెరికా, భారత్ సహా ఎన్నో దేశాల్లో ఈ టీకాను వినియోగిస్తున్నారని చెప్పారు. ఆస్ట్రాజెనెకాపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో జాన్సన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫైజర్‌తో ఈయూ కమిషన్ డీల్..
రానున్న మూడు నెలల్లో 10 మిలియన్ టీకా డోసులను సరఫరా చేసేందుకు ఫైజర్ సంస్థతో ఈయూ కమిషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 200 మిలియన్లకు పైగా టీకా డోసులను తమ కూటమిలోని 27 దేశాలకు పంపిణీ చేయనున్నామని తెలిపింది. ఈ మేరకు ఐరోపా సమాఖ్య కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ దేర్ లేయన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'ఆస్ట్రాజెనెకా సేఫ్.. అక్కడ తయారైతేనే ఇబ్బంది!'