తెలంగాణ

telangana

ETV Bharat / international

సరిహద్దులు తెరిచిన ఐరోపా దేశాలు.. భారతీయులకు నో ఎంట్రీ - 27 countries union

కరోనా మహమ్మారిని నిలువరించేందుకు సరిహద్దులను నెలల పాటు మూసివేసిన ఐరోపా దేశాలు.. బుధవారం నుంచి తిరిగి తెరుస్తున్నాయి. 15 దేశాల పౌరులను తమ దేశంలోకి అనుమతించనున్నాయి. కరోనా కేసులు అధికంగా ఉన్నందున అమెరికా సహా భారత్​ పౌరులకు అనుమతి నిరాకరించాయి.

EU countries borders reopen
సరిహద్దులు తెరిచిన ఐరోపా దేశాలు.. భారతీయులకు నో ఎంట్రీ

By

Published : Jul 1, 2020, 5:09 AM IST

Updated : Jul 1, 2020, 6:47 AM IST

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సరిహద్దులను మూసేసిన ఐరోపాదేశాలు చైనా సహా 15దేశాల పౌరులను బుధవారం నుంచి అనుమతించనున్నాయి. అయితే భారత్‌, అమెరికా, బ్రెజిల్, రష్యా పౌరులకు అనుమతి నిరాకరించాయి. ఆయా దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐరోపా సమాఖ్య తెలిపింది. 15 దేశాల పౌరులు ఐరోపా సమాఖ్యలోని 27 దేశాలు సహా మరో 4 దేశాల్లో పర్యటించేందుకు వెసులుబాటు కల్పించారు.

చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, కెనడా, దక్షిణకొరియా, థాయ్‌లాండ్, జార్జియా, మొరాకో అల్జీరియా, రువాండా, సెర్బియా, ఉరుగ్వే, మొంటెనెగ్రో, టునీసియాలు అనుమతి పొందిన దేశాల జాబితాలో ఉన్నాయి. అయితే వైరస్ కేసుల ఆధారంగా ప్రతి 14 రోజులకోసారి ఆయాదేశాల పేర్లను జాబితాలో చేర్చడమో, తొలగించడమో చేస్తామని ఐరోపా సమాఖ్య ప్రకటించింది.

Last Updated : Jul 1, 2020, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details