ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య సమూహం ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్ 2020 జనవరి 31 నాటికి వైదొలగాల్సి ఉంది. అనంతరం బ్రిటన్ ప్రభుత్వంతో.. ఈయూ వాణిజ్య వ్యాపార పరమైన చర్చలు ప్రారంభించి ఏడాది చివరి నాటికి ముగించాల్సి ఉంది. చర్చలకు గడువు చాలా తక్కువగా ఉందని, మరింత సమయం అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు ఐరోపా కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డేర్ లెయన్..శుక్రవారం ఓ ఫ్రెంచ్ బిజినెస్ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బ్రెగ్జిట్‌పై పలు విషయాలను మాట్లాడారు.
ఒక వైపు నుంచి వస్తే సరిపోదు..
చర్చలకు తక్కువ సమయం ఉందని, గడువు పొడిగించాలన్న ప్రతిపాదన ఒక వైపు నుంచి వస్తే సరిపోదని, ఇరువైపులా రావాలని ఉర్సులా అంటున్నారు. ఇరు పక్షాలకు పెద్దగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘ వ్యాపార అనుబంధం ఉన్న రెండు వర్గాలు విడిపోయేటప్పుడు లావాదేవీల విషయంలో జరిగే చర్చలు సంవత్సరాలు కొనసాగుతాయని.. రోజులు, నెలల్లో తేలవన్నారు.