తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రధాని.. రాష్ట్రపతి.. అందరూ మహిళలే! - ఎస్తోనియా ప్రెసిడెంటు

ఐరోపాలోని ఎస్తోపియా అరుదైన ఘనత సాధించింది. ప్రధాని, రాష్ట్రపతి ఇద్దరూ మహిళలే కావడం విశేషం. అంతే కాదు క్యాబినెట్​లోని మంత్రుల్లో సగానికి పైగా మహిళలే ఉన్నారు.

estopia, women majority
ఎస్తోపియా రికార్డు

By

Published : Jan 30, 2021, 10:20 AM IST

ఐరోపాలోని ఎస్తోనియా దేశ రాష్ట్రపతి, ప్రధాని ఇద్దరూ మహిళలే. ఇలా ఈ రెండు పదవులనూ మహిళలు స్వీకరించడం వల్ల ప్రపంచంలోనే ఈ దిశగా మహిళానేతలున్న తొలి దేశంగా నిలిచింది. ఈ నెల 26న ఆ దేశానికి రాష్ట్రపతిగా కర్‌స్తీ కలిజులేడ్‌, ప్రధానిమంత్రిగా కాయస్‌ కల్లాస్‌ పదవీస్వీకారం చేశారు. దీంతో పూర్తిస్థాయిలో మహిళా అధిపతులు ఉన్న దేశంగా ఎస్తోనియా రికార్డు సృష్టించింది.

2016లో ఆ దేశపార్లమెంటు ద్వారా రాష్ట్రపతిగా ఎన్నికైన కలిజులెయిడ్‌ తొలి మహిళారాష్ట్రపతిగా ఎస్తోనియా దేశ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు, అత్యంత తక్కువ వయసు నేతగా చరిత్రలోకెక్కారు. ఈ ఏడాది జనవరి 14న ఈమె కాయస్‌ కల్లాస్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా నామినేట్‌ చేశారు. ఈ దిశగా ఈమె ఇటీవల ప్రధానమంత్రిగా పదవీస్వీకారం చేసి ఎస్తోనియా దేశ తొలి మహిళా ప్రధానిగా నిలిచారు. ఆ తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఏడుగురు మహిళామంత్రులకు చోటిచ్చింది. దీంతో క్యాబినెట్‌లో సగంమందికిపైగా మంత్రి పదవుల్లో మహిళలుండటం కూడా ఆ దేశ రాజకీయ చరిత్రలో రికార్డును సృష్టించింది.

ఇదీ చదవండి :'హెచ్​4 వీసాలపై నిర్ణయం.. బైడెన్​ నిబద్ధతకు నిదర్శనం'

ABOUT THE AUTHOR

...view details