తెలంగాణ

telangana

ETV Bharat / international

పర్యావరణ సంరక్షణకై కదిలిన దళం...

వాతావరణ కాలుష్యంపై బ్రిటన్​ వాసులు కన్నెర్ర చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని  వందల మంది ఆందోళనకు దిగారు. బ్రిటన్​ వీధుల్లో చేపడుతోన్న నిరసనలు ఐదో రోజుకు చేరుకున్నాయి.

By

Published : Apr 19, 2019, 9:46 PM IST

పర్యావరణ సంరక్షణకై కదిలిన దళం...

పర్యావరణ సంరక్షణకై కదిలిన దళం...

నానాటికీ పెరిగిపోతోన్న వాతావరణ కాలుష్యంపై కదంతొక్కారు బ్రిటన్​వాసులు. పర్యావరణ సంరక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వంపై నిరసనగా వందల మంది వీధుల్లోకి వచ్చారు. కాలుష్యంపై అవగాహన పెంచేందుకు చేపడుతోన్న ఆందోళనలు ఐదో రోజుకు చేరుకున్నాయి.

లండన్​లోని ప్రధాన నగరాలలో గత సోమవారం నుంచి వందల మంది బ్రిటన్​వాసులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. థేమ్స్​ నదిపై ఉన్న వాటర్​లూ వంతెన, పార్లమెంట్​ ఆవరణ, ఆక్స్​ఫర్డ్​​ సర్కస్​, మార్బెల్​ ఆర్చ్​ల వంటి ప్రాంతాల్లో రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలతో లండన్​ నగరవ్యాప్తంగా రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలిగింది.

ఈస్టర్​ సెలవులతో... వారాంతంలో యూరప్​లోనే అత్యంత రద్దీ గల హీత్రో విమానాశ్రయం వద్ద నిరసనలు చేపడతామని హెచ్చరించారు ఆందోళనకారులు. బ్రిటన్​ ప్రభుత్వం.. సంరక్షణ చర్యలకు ఉపక్రమించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

నిరసనలు చేస్తున్న సుమారు 460 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details