Elon Musk Challenges Russia: టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సవాలు విసిరారు. తనతో పోరాడేందుకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ నగరాలపై రష్యన్ బలగాలు దండెత్తున్నాయి. కాగా రష్యా తీరుపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్విటర్ వేదికగా పుతిన్‌కు ఎలాన్ మస్క్ ఛాలెంజ్ చేశారు. 'నాతో పోరాడేందుకు వ్లాదిమిర్ పుతిన్‌కు సవాలు విసురుతున్నా' అంటూ రష్యా అధ్యక్ష భవనాన్ని ట్యాగ్ చేశారు. రష్యా వర్ణమాలలోనే పుతిన్ పేరును రాసుకొచ్చారు. ఈ పోరులో గెలిచినవారే ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగాలా, ఆగిపోవాలా నిర్ణయిస్తారు అని అర్థం వచ్చేలా 'ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు' అని ట్వీట్‌లో ప్రస్తావించారు.
'నాతో ఫైట్‌కు రెడీనా'.. పుతిన్‌కు మస్క్ సవాల్ - వ్లాదిమిర్ పుతిన్
Elon Musk Challenges Russia: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సవాలు విసిరారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్. పుతిన్ తనతో పోరాడాలని... గెలిచినవారు ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్లకు ఎలాన్ మస్క్ గతంలోనూ బాసటగా నిలిచారు. స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని ప్రారంభించి నిరంతరాయ ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరిన్ని టెర్మినళ్లను సైతం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమయంలో అక్కడి ప్రజలకు కీలక సమాచారం చేరవేసేందుకు నిరంతర ఇంటర్నెట్ సేవల్ని ప్రారంభించారు.
ఇదీ చూడండి :రష్యా బాంబు దాడిలో నిండు గర్భిణి మృతి