2019 సంవత్సరానికి గానూ ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైన అభిజిత్ బెనర్జీ పురస్కారాన్ని స్వీకరించారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆ దేశ రాజు కారల్ గుస్టాఫ్ చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అభిజిత్ బెనర్జీతో పాటు ఆర్థికశాస్త్రంలో నోబెల్‌కు ఎంపికైన ఆయన భార్య డఫ్లో, మైఖేల్ క్రెమర్‌లు అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం సహా సాహిత్యంలో అవార్డుకు ఎంపికైనవారికి పురస్కారాలు ప్రదానం చేశారు.
'ఆర్థిక' నోబెల్ అందుకున్న అభిజిత్ బెనర్జీ - ecomonic nobel laureate
ఆర్థికశాస్త్రంలో నోబెల్‌కు ఎంపికైన అభిజిత్ బెనర్జీ స్వీడన్లో అవార్డును స్వీకరించారు. రాజధాని స్టాక్‌హోంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆ దేశ రాజు కారల్ గుస్టాఫ్ నుంచి నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. అభిజిత్‌తో పాటు నోబెల్‌కు ఎంపికైన ఆయన సతీమణి డఫ్లో, మైఖేల్ క్రెమర్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
'ఆర్థిక' నోబెల్ అందుకున్న అభిజిత్ బెనర్జీ
ప్రపంచవ్యాప్తంగా పేదరికంపై పోరాటానికి అనుసరించాల్సిన అత్యుత్తమ మార్గాలేమిటో తెలుసుకొనేలా సరికొత్త విశ్వసనీయ విధానాల్ని పరిచయం చేశారు అభిజిత్. ఈ కృషికి 2019 సంవత్సరానికి అభిజిత్ బెనర్జీ, ఈస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్‌లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది.
ఇదీ చూడండి: అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి
Last Updated : Dec 11, 2019, 12:59 PM IST