గ్రీస్ రాజధాని ఏథెన్స్ను భూకంపం కుదిపేసింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైంది. భూ ప్రకంపనలకు బెంబేలెత్తిన ప్రజలు.. భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.
ఏథెన్స్ నగరానికి వయవ్యాన 23 కి.మీల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
శుక్రవారం భూంకంపం కారణంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రీస్‌లో అతిపెద్ద నౌకాశ్రయం పోర్ట్ పిరేయిస్ నుంచి ఓడల ప్రయాణాలు నిలిచాయి.