తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ పండు వాసనకు ఆరుగురికి తీవ్ర అనారోగ్యం - durian fruit recent news

డురియన్​.. అత్యంత దుర్గంధం వెదజల్లే పండ్లలో ఇదొకటి. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, థాయ్​లాండ్​లో దొరికే ఈ ఫ్రూట్​.. చూడ్డానికి పనస పండులా ఉంటుంది. అయితే ఇది కుళ్లితే ముక్కు భరించలేని వాసన వస్తుంది. తాజాగా దీని వాసన పీల్చి ఆరుగురు ఆస్పత్రికి చేరగా.. 60 మంది ఉన్న ఆఫీస్​ ఖాళీ చేయించారు.

durian news
ఆ పండు వాసనకే ఆస్పత్రి పాలైన ఆరుగురు సిబ్బంది

By

Published : Jun 23, 2020, 7:15 PM IST

డురియన్‌ పండు

పనస కాయలా కనిపించే ఈ పండు పేరు 'డురియన్‌'. చూడ్డానికి ఆకర్షణలో రారాజుగా ఉన్నా సువాసనలో మాత్రం జీరోనే. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత దుర్వాసన వెదజల్లే పండ్లలో ఒకటి. రుచిలోనూ అదుర్స్​ అనిపించే ఈ ఫ్రూట్​.. కుళ్లిందంటే ఆసుపత్రిలో చేరాల్సిందే! అంతటి కంపు కొడుతుంది కాబట్టే ఈ పండు అమ్మకం, రవాణాను చాలా దేశాల్లో నిషేధించారు. తాజాగా జర్మనీలోని ఓ పోస్టాఫీస్​లో ఈ పండు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అక్కడి సిబ్బంది.

ఇదీ జరిగింది..!

పోస్టాఫీస్​కు​ ఓ మోస్తరు బరువున్న ప్యాకేజ్​ వచ్చింది. అయితే డెలివరీకి సిద్ధం చేస్తున్న సమయంలో దాన్నుంచి వచ్చిన గ్యాస్​ గాఢతకు దాదాపు 12 మంది పోస్టల్​ అధికారులు విపరీతంగా వాంతులు చేసుకున్నారు. ఇందులో ఆరుగురికి పరిస్థితి విషమించడం వల్ల ఆసుపత్రికి తరలించారు. ఆ భవనంలోని 60 మందిని తక్షణమే ఖాళీ చేయించారు.

ఈ ఫ్రూట్​ను న్యూరెంబర్గ్​ నుంచి ఓ వ్యక్తి తన 50 ఏళ్ల స్నేహితుడికి పార్శిల్​ పంపినట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ పండును ఆసియాలోని పలు దేశాల్లో నిషేధించారు. హోటళ్లలో వాడటం, ప్రజా రవాణాలో తరలించకూడదని నిబంధనలూ విధించారు.

అయితే మనుషులను ఇబ్బందులకు గురిచేసే ఈ పండు రుచిలో చాలా బాగుంటుందట. అందుకే దీన్ని 'పండ్లలో రాజా' అని పిలుస్తుంటారు.

డురియన్‌ పండు ప్రయోజనాలివే..:

  • కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.
  • విటమిన్- బీ6 సమృద్ధిగా ఉంటుంది. మతిమరుపు, గుండె సంబంధిత వ్యాధులకు బాగా పనిచేస్తుంది.
  • దంతాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది.
  • ఒత్తిడి, కుంగుబాటు సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా మంచిది.
  • విటమిన్-సీ వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.
  • జీర్ణక్రియ, బ్లడ్ సుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, లైంగిక సమస్యలను నివారిస్తుంది.

రుచి, ప్రయోజనాలు మెండుగా ఉన్న ఈ పండు.. ధర కూడా వేలల్లోనే పలుకుతుంది. అయితే కుళ్లిందంటే మాత్రం అంతే స్థాయిలో చేటు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details