తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఓయ్ డాల్ఫిన్​.. పిల్లాడిని ఎందుకు కరిచావ్​?' - ఉక్రెయిన్​లో డాల్ఫిన్ వార్తలు

ఉక్రెయిన్​కు చెందిన ఓ వ్యక్తి తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో ​ పోస్ట్ చేసిన ఓ వీడియో.. వైరల్​గా మారింది. అందులో ఓ ఆరేళ్ల బాలుడి చేతిని డాల్ఫిన్​ కొరకటం కనిపించింది. అయితే.. ఎందుకలా బాలుడిని డాల్ఫిన్​ కరిచిందని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

dolphin bites hand
డాల్ఫిన్​

By

Published : Jun 14, 2021, 11:15 AM IST

Updated : Jun 14, 2021, 12:03 PM IST

ఓ ఆరేళ్ల పిల్లాడు అక్వేరియమ్​ పక్కన కూర్చుని నీళ్లతో సరదాగా ఆడుకుంటున్నాడు. అంతలో ఓ డాల్ఫిన్ బాలుడిని చేతిని కరిచేసింది. దాంతో అతడి చేతిపై మూడు పెద్ద గాట్లు పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో షేర్​ చేయగా వైరల్​గా మారింది.

నీళ్ల నుంచి డాల్ఫిన్​ బయటకు వచ్చి బాలుడి చేయి కరిచిందని @odessa_hello అనే ఇన్​స్టాగ్రామ్ ఖాతాదారుడు పేర్కొన్నారు. ఈ ఘటన ఉక్రెయిన్​ బ్లాక్​ సీ రిసార్ట్​లోని​ నీమో డాల్ఫినేరియమ్ వద్ద జరిగిందని తెలిపాడు.

ఆహారం అనుకునే అలా..

అయితే.... దీనిపై డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చే లాడ్​బైబిల్​ అనే వ్యక్తి స్పందిస్తూ.. బాలుడిపై డాల్ఫిన్ కావాలనేం దాడి చేయలేదని చెప్పారు. " నీళ్లపై చేతిని ఆడిస్తున్నట్లుగా కనిపించింది. అంటే.. తన కోసం ఎవరైనా ఆహారాన్ని అందిస్తున్నారేమోనని డాల్ఫిన్​ భావించింది. అందుకే ఆ చిన్నారి చేయిని కరిచింది." అని తెలిపారు.

ఆకలిగా ఏం లేదు..

సదరు బాలుడిని ఆస్పత్రికి తరలించినట్లు మిర్రర్​ వార్తా కథనం వెలువరించింది. అక్కడ అతనికి వైద్యులు కుట్లు వేసినట్లు తెలిపింది. కాగా.. ఈ ఘటన జరిగిన డాల్ఫినేరియమ్​ ప్రతినిధులు మాత్రం డాల్ఫిన్​ ఆకలితోనో లేదా ఆగ్రహంగానో లేదని పేర్కొన్నారు. ఏదేమైనా.. డాల్ఫిన్ల వద్ద సందర్శకుల కోసం భద్రతను మరింతగా పెంచుతామని చెప్పారు.

ఇదీ చూడండి:డాల్ఫిన్​కు, కుక్కకు దోస్తీ కుదిరిందిలా...

ఇదీ చూడండి:కస్తూర్బా విద్యాలయంలో డాల్ఫిన్ చదువు

Last Updated : Jun 14, 2021, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details