Ukraine indian embassy: అధికారులతో సమన్వయం లేకుండా బోర్డర్ పోస్టుల వద్దకు వెళ్లవద్దంటూ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం సూచించింది. కీవ్ సహా ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా దాడులు పెరుగుతున్న వేళ ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం నూతన అడ్వైజరీని జారీ చేసింది. సరిహద్దు పాయింట్ల వద్ద పరిస్థితి సున్నితంగా ఉందని రాయబార కార్యాలయం పేర్కొంది. అధికారులతో సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించింది. ముందస్తు సమాచారం లేకుండా వెళ్తే సాయం చేయడం కష్టమని పేర్కొంది. ఉక్రెయిన్ పశ్చిమ నగరాల్లో వసతులు ఉన్నచోట ఉండటం సురక్షితమని సూచించింది. పరిస్థితిని తెలుసుకోకుండా సరిహద్దు చెక్ పాయింట్‌లకు వెళ్లవద్దని పేర్కొంది.
Russia Ukraine War: 'సమాచారం లేకుండా సరిహద్దులకు వెళ్లొద్దు' - ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులు
Ukraine Indian Students: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులకు కేంద్రం కీలక సూచన చేసింది. సరిహద్దు పాయింట్ల వద్ద పరిస్థితి సున్నితంగా ఉందని, అధికారులతో సమన్వయం లేకుండా ఎవరూ బోర్డర్ పోస్టులకు రావద్దని చెప్పింది.
![Russia Ukraine War: 'సమాచారం లేకుండా సరిహద్దులకు వెళ్లొద్దు' Ukraine Indian Students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14573872-thumbnail-3x2-img.jpg)
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులకు కేంద్రం కీలక సూచన
తూర్పు ఉక్రెయిన్‌లో తదుపరి సూచనలు చేసేవరకూ ఇళ్లల్లోనే ఉండాలన్న రాయబార కార్యాలయం అన్ని వేళల పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.
ఇదీ చదవండి:రష్యాకు వ్యతిరేకంగా యూఎన్ఎస్సీలో తీర్మానం- ఓటింగ్‌కు భారత్ దూరం