తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచ దేశాల ఉదారత- అఫ్గాన్​కు 1.2 బిలియన్ డాలర్ల సాయం! - afghanistan un meeting

అఫ్గాన్ ప్రజలను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం నడుం కట్టింది. సహాయ కార్యక్రమాల కోసం ఐరాస (United Nations) 606 మిలియన్ డాలర్లు అడగ్గా.. అంతకు రెట్టింపు సాయం ప్రకటించింది. వివిధ దేశాలన్నీ కలిపి 1.2 బిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించాయని అధికారులు తెలిపారు.

afghanistan aid program
అఫ్గానిస్థాన్

By

Published : Sep 14, 2021, 12:41 PM IST

అఫ్గానిస్థాన్​లో మానవతా సంక్షోభాన్ని (Afghan crisis) పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ఇందుకోసం 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,833 కోట్లు) సాయాన్ని ప్రకటించింది.

అఫ్గాన్ పరిస్థితులపై జెనీవాలో సోమవారం ఐరాస (United Nations) నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో (Afghanistan UN meeting) ఈ మేరకు ఆర్థిక సహాయం గురించి సభ్య దేశాలు చర్చించాయి. ఈ ఏడాది చివరి వరకు ముఖ్యమైన సహాయక చర్యలు (Afghan assistance program) కొనసాగాలంటే.. 606 మిలియన్ డాలర్లు కావాలని సమావేశంలో ఐరాస పేర్కొంది. అయితే, సభ్యదేశాలు ఏకంగా 1.2 బిలియన్ డాలర్లు ప్రకటించాయని ఐరాస అత్యవసర సహాయక విభాగం కోఆర్డినేటర్ మార్టిన్ గ్రిఫిత్స్ పేర్కొన్నారు. ఈ నిధులు అఫ్గాన్​ ప్రజలకు జీవన రేఖగా మారతాయని అన్నారు. అయితే, ఇంతటితో అంతా అయిపోయినట్లు కాదని, అఫ్గాన్ కష్టాలు తీరిపోలేదని చెప్పారు.

'తాలిబన్లతో చర్చించాల్సిందే'

జెనీవాలో జరిగిన సమావేశం అంచనాలకు మించి ఫలితాలను రాబట్టిందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ (Antonio Guterres) పేర్కొన్నారు. మరోవైపు, తాలిబన్లతో (talks with Taliban) సంప్రదింపులు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆంటోనియో గుటెరస్

"ఐరాస చేసిన అత్యవసర విజ్ఞప్తికి స్పందనగా సభ్య దేశాలు వంద కోట్ల డాలర్లకు పైగా సహాయాన్ని ప్రకటించాయి. అఫ్గాన్ ప్రజల పట్ల అంతర్జాతీయ సమాజానికి ఉన్న నిబద్ధతను ఇది సూచిస్తోంది. అఫ్గాన్​లో సహాయ కార్యక్రమాలను కొనసాగించాలంటే.. ఆ దేశంలోని వాస్తవ అధికార యంత్రాంగంతో సంప్రదింపులు చేయక తప్పదు. ఉగ్రవాదమైనా, మానవహక్కులైనా, మాదకద్రవ్యాలైనా.. అంతర్జాతీయ సమాజానికి ఉన్న అన్ని ఆందోళనల విషయంలో తాలిబన్లతో సంప్రదింపులు కొనసాగించాలి."

-ఆంటోనియో గుటెరస్, ఐరాస చీఫ్

అఫ్గాన్​లో తాలిబన్ల ఆక్రమణ తర్వాత తలెత్తిన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు గుటెరస్. ఈ పరిస్థితుల్లో ఐరాస అక్కడ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇదీ చదవండి:

'అఫ్గాన్​ను ఆదుకునే బాధ్యత అమెరికాదే'

అఫ్గానీలకు అండగా నిలబడతాం: భారత్‌

ABOUT THE AUTHOR

...view details