తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్​తో అధిక ముప్పు'

భారతదేశంలో మొట్టమొదటి సారిగా గుర్తించిన కరోనా డెల్టా రకం(బీ1.617.2) ఇతర వేరియంట్​ల కన్నా 40 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు బ్రిటన్ ఆరోగ్య మంత్రి హాన్​కాక్ వెల్లడించారు. ఆ దేశంలో ఇటీవలీ కాలంలో కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణమని ఆయన పేర్కొన్నారు.

Delta variant
డెల్టా రకం కరోనా

By

Published : Jun 6, 2021, 11:07 PM IST

భారత్‌లో గుర్తించిన కరోనా కొత్త రూపాంతరం డెల్టా వేరియంట్‌ యూకేలో కనుగొన్న ఆల్ఫా స్ట్రెయిన్‌ కంటే 40శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్‌ ఆరోగ్యమంత్రి మ్యాట్‌ హన్‌కాక్‌ అన్నారు. ఇటీవల బ్రిటన్‌లో పెరుగుతున్న కేసుల వెనక డెల్టా వేరియంట్‌ ఉందన్న ఆయన.. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

డెల్టా రకం సోకిన వారికి రెండు టీకాలు అందించటం ద్వారా మాతృ వేరియంట్‌కు సమానమైన రక్షణను పొందవచ్చని ఆయన చెప్పారు. మెుదటి డోసు తీసుకున్న వారందరూ త్వరగా రెండో డోసు తీసుకోవాలని మ్యాట్‌ హన్‌కాక్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కొద్ది రోజుల్లో బ్రిటన్‌లోని 30 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆరోగ్యమంత్రి తెలిపారు.

తద్వారా.. కేసుల తీవ్రతను నియంత్రిచటంతోపాటు ఆసుపత్రుల్లో బాధితుల రద్దీని తగ్గించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details