కొవిడ్-19 డెల్టా వేరియంట్(Delta Variant) 85 దేశాల్లో బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్(WHO)థ తెలిపింది. ఇప్పటి వరకు గుర్తించిన కరోనా వేరియంట్లలో డెల్టా రకం.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పేర్కొంది. అలాగే.. వ్యాక్సిన్(Corona Vaccine) తీసుకోని ప్రజల్లో ఇది వేగంగా వ్యాపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రెయెసస్ హెచ్చరించారు.
"ప్రస్తుతం డెల్టా వేరియంట్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. డబ్ల్యూహెచ్ఓ సైతం దాని పట్ల ఆందోళన చెందుతోంది. ఇప్పటి వరకు గుర్తించిన వాటిల్లో ఇదే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొన్ని దేశాలు ఆంక్షలను సడలించటం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువ కేసులు అంటే ఎక్కువ మంది ఆసుపత్రుల్లో చేరటమే. దాంతో ఆరోగ్య సిబ్బంది, వైద్య వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ కారణంగా మరణాలు పెరిగే ప్రమాదం ఎక్కవుతుంది. "
- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్