ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతుల ప్రదానోత్సవంలో భాగంగా స్వీడన్ రాజధాని స్టాక్‌హోం సిటీ హాల్‌లో డిసెంబరులో జరగనున్న సంప్రదాయ విందును రద్దు చేసినట్లు నోబెల్ ఫౌండేషన్ తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
సాధ్యం కాదు!
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో 1300 మంది అతిథులను పిలిచి... విందు నిర్వహించడం సాధ్యం కాదని నోబెల్ ఫౌండేషన్ సీఈఓ లార్స్ హైకెన్‌స్టెన్ అన్నారు. విజేతలు స్వీడన్‌కు వెళ్లడంపై కూడా అనిశ్చితి నెలకొన్నట్లు చెప్పారు.