తెలంగాణ

telangana

ETV Bharat / international

స్పెయిన్​ను వణికించిన 'గ్లోరియా'... 11 మంది బలి - Spain Catalonia latest

స్పెయిన్​లో గ్లోరియా తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను ధాటికి 11 మంది మృతి చెందారు. తుపానులో చిక్కుకున్న మరో నలుగురి కోసం సహాయక సిబ్బంది గాలింపు చేపట్టారు. బలమైన గాలులు, కుండపోత వర్షాలతో స్పెయిన్​ను వణికించింది గ్లోరియా.

Death toll rises to 11 in Spain as Storm Gloria ebbs
స్పెయిన్​ను వణికించిన గ్లోరియా తుపాను... అప్రమత్తమైన ఫ్రాన్స్

By

Published : Jan 24, 2020, 10:18 AM IST

Updated : Feb 18, 2020, 5:11 AM IST

స్పెయిన్​లో గ్లోరియా తుపాను ధాటికి 11 మంది మృతి చెందగా... మరో నలుగురు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. గాలుల వేగానికి ఇళ్లతో సహా అనేక హోటళ్లు దెబ్బతిన్నాయి. తూర్పు స్పెయిన్‌లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షాలు కురిశాయి.

ఈ వర్షాల కారణంగా ఐరోపాలోని పర్యటక ప్రదేశాలు.. తీరప్రాంతాలా దెబ్బతిన్నాయి. మరికొన్ని పట్టణాల్లో వరదలు సంభవించాయి.

తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ప్రధాని పెడ్రో శాంచెజ్​ పర్యటించారు. తక్షణమే ప్రభుత్వ సాయం అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.

2018లో మల్లోర్కాలోని హాలిడే ద్వీపంలో సంభవించిన వరదలకు 13 మంది మరణించారు.

స్పెయిన్​ను వణికించిన 'గ్లోరియా'... 11 మంది బలి

ఇదీ చదవండి:'పాక్​ ప్రధాని'​ వార్తలు చూడట్లేదట.. ఎందుకు?

Last Updated : Feb 18, 2020, 5:11 AM IST

ABOUT THE AUTHOR

...view details