ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది ముగ్గురిని వరించింది(nobel prize economics 2021). అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు డేవిడ్ కార్డ్, జాషువా డి. ఆంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. అయితే ఇందులో సగం పురస్కారాన్ని డేవిడ్ కార్డ్‌కు ఇవ్వగా.. మిగతా సగాన్ని జాషువా, గైడో పంచుకోనున్నారు.(nobel prize 2021)
కార్మిక ఆర్థిక అంశాలకు సంబంధించి పరిశోధనాత్మక సహకారం అందించినందుకు గానూ డేవిడ్ కార్డ్‌కు నోబెల్ అందిస్తున్నట్లు అకాడమీ వెల్లడించింది. ఇక ఆర్థికశాస్త్రానికి సంబంధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడోలకు కూడా పురస్కారం ఇస్తున్నట్లు తెలిపింది.