తెలంగాణ

telangana

ETV Bharat / international

రఫేల్​ ఒప్పందంలో అక్రమాలు జరగలేదు: డసో - డసో ఏవియేషన్స్

రఫేల్​ ఒప్పందంపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది ఫ్రెంచ్​ విమాన తయారీ సంస్థ డసో ఏవియేషన్స్. భారత్​తో ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది.

Dassault Aviation rejects fresh allegations of corruption in Rafale deal
రఫేల్​ ఒప్పందంలో అక్రమాలు జరగలేదు: డసో

By

Published : Apr 8, 2021, 11:01 PM IST

భారత్​తో జరిగిన రఫేల్​ ఒప్పందంపై ఇటీవల వచ్చిన ఆరోపణలను గురువారం ఖండించింది ఫ్రెంచ్​ ఏరోస్పేస్​ దిగ్గజం డసో. ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పింది. ఒప్పందంలో అక్రమాల గురించి ఫ్రెంచ్ ఆన్​లైన్ జర్నల్ 'మీడియా పార్ట్'​ ఇటీవలే ఓ కథనం ప్రచురించిన అనంతరం.. డసో ఈ మేరకు స్పందించింది.

"2000 సంవత్సరం ఆరంభం నుంచే అవినీతిని అరికట్టడానికి కఠినమైన అంతర్గత విధానాలను అమలుచేస్తున్నాం. పారిశ్రామిక, వాణిజ్య సంబంధాల్లో సమగ్రత, విలువలు, ఖ్యాతి కోసం కచ్చితత్వంతో పనిచేస్తున్నాం. భారత్​తో 36 రఫేల్​ యుద్ధ విమానాల ఒప్పందంలో ఎన్నో నియంత్రణ చర్యలు తీసుకున్నాం."

- డసో అధికార ప్రతినిధి

2016లో రఫేల్​ ఒప్పందం జరిగిన తర్వాత డసో సంస్థ.. మధ్యవర్తిగా వ్యవహరించిన భారత కంపెనీ 'డెఫ్సిస్'​ సొల్యూషన్స్​కు రూ.9 కోట్ల 48లక్షలు చెల్లించిందని ఫ్రెంచ్​ మీడియాలో వార్తలు వచ్చాయి. ఫ్రెంచ్ అవినీతి నిరోధక సంస్థ దర్యాప్తు ఆధారంగానే వాటిని ప్రచురించినట్లు తెలిపాయి.

ఇదీ చూడండి:రఫేల్ ముడుపులపై రాజకీయ రగడ

ABOUT THE AUTHOR

...view details