చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధానికి ప్రత్యేక స్థానముంది. 1939లో పోలెండ్‌పై జర్మనీ చేసిన దాడితో ప్రారంభమైన ఈ యుద్ధం, 1945లో జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని సోవియట్ యూనియన్ ఆక్రమించుకోవడం, హిట్లర్ ఆత్మహత్యతో ముగిసింది. దాదాపు ఆరేళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ సమరంలో ప్రపంచం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. అయితే.. ఈ యుద్ధంలో హిట్లర్ విలన్ అని, యుద్ధానికి జర్మనీ కారణమని అంటుంటారు. కానీ, యుద్ధం చివరి రోజుల్లో రష్యా సైన్యం పాశవిక చేష్టలకు బెర్లిన్ నగరం చిగురుటాకులా వణికిపోయిందన్న విషయం కొంతమందికి మాత్రమే తెలుసు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, జపాన్, ఇటలీ అక్షరాజ్య కూటమిని ఏర్పాటు చేయగా.. సోవియట్ రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, పోలెండ్ తదితర దేశాలన్నీ మిత్రపక్ష కూటమిగా ఏర్పడ్డాయి. యుద్ధం ముగింపు దశలో అమెరికా కూడా మిత్ర రాజ్యాల సరసన చేరింది. యుద్ధం తొలినాళ్లలో విజయం జర్మనీ పక్షం ఉన్నప్పటికీ.. 1944కి వచ్చే సరికి పూర్తిగా మిత్ర రాజ్యాలవైపు మొగ్గింది. సోవియట్ సేనలు అప్రతిహత విజయాలను సాధిస్తూ జర్మన్ దళాలను రష్యా నుంచి పారదోలడమే కాకుండా పోలెండ్, రుమేనియాలోకి చొచ్చుకుపోయాయి. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలల్లో జర్మనీ చివరిసారిగా మిత్ర రాజ్యాల సేనలపై చేసిన ఎదురుదాడులు పూర్తిగా విఫలమయ్యాయి. అదే ఏడాది మే నెలలో సోవియట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్‌ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించి సఫలమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రపంచం తలదించుకునే ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఎవర్నీ వదల్లేదు..!
జర్మనీ మహిళలు, చిన్నారులపై రష్యా సేనలు పాశవిక చర్యలకు పాల్పడ్డాయి. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఎవరు కనిపించినా వదల్లేదు. యుద్ధంలో తమ భర్తను కోల్పోయిన మహిళలు కనీసం తమ నగరాన్నయినా కాపాడుకునేందుకు సోవియట్ సేనలపై ఎదురు తిరిగారు. వారి తిరుగుబాటును రష్యా సైన్యం ఉక్కుపాదంతో అణిచివేసింది. అంతేకాకుండా వారిని బలాత్కరించి కీచకానందం పొందింది. అయితే ఈ ఘటనలను అప్పట్లో రష్యా మీడియా కొట్టిపారేసింది. అదంతా బూటకమే అని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఉక్రెయిన్‌కు చెందిన వ్లాదిమిర్ జెల్ఫాండ్ అనే లెఫ్టినెంట్ తన డైరీలో రాసుకొచ్చిన విషయాలు జర్మన్ మహిళలు ఎదుర్కొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఆయన కూడా రష్యన్ సైన్యంలో ఓ అధికారి. అప్పట్లో సైనికులు డైరీ రాయడంపై సోవియట్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. యుద్ధానికి సంబంధించిన ఎలాంటి అంశాలను అందులో రాయకూడదు. కానీ, వ్లాదిమిర్ జెల్ఫాండ్ మాత్రం రహస్యంగా తన డైరీలో 16 ఏప్రిల్ 1945 నుంచి 2 మే 1945 వరకు బెర్లిన్ నగరాన్ని ఆక్రమించుకునే క్రమంలో ఏం జరిగిందో తన డైరీలో రాసుకొచ్చాడు.
ఐదు వేల మంది సైనికులు
మొత్తం 80 వేల మంది సైనికులున్న స్టాలిన్ నేతృత్వంలోని సోవియట్ సేనల్లో దాదాపు 5000 మంది బెర్లిన్ నగరాన్ని ఆక్రమించుకునేందుకు వచ్చారు. అప్పటికే యుద్ధంలో తమ భర్తలను కోల్పోయిన చాలా మంది మహిళలు వారితో పోరాడేందుకు సమర శంఖం పూరించారు. కానీ, సోవియట్ సేనల ముందు నిలవలేకపోయారు. ఈ క్రమంలోనే సోవియట్ సైనికులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా అత్యంత కర్కశంగా వ్యవహరించారు. యుద్ధనీతిని మరచిపోయి వారిపై పాశవిక చర్యలకు పాల్పడ్డారు. దొరికిన మహిళను దొరికినట్టుగా అత్యాచారం చేశారు. కేవలం తమను ప్రతిఘటించిన మహిళలపైనే కాదు.. బెర్లిన్ వీధుల్లో తిరుగుతూ చిన్నాపెద్దా అని చూడకుండా వికృత చర్యలకు పాల్పడ్డారు. కన్నకూతుళ్లను తల్లుల ముందే చెరబట్టారు. దీంతో ఓ వైపు భర్తను కోల్పోయి, మరోవైపు కూతుళ్లను కాపాడుకోలేని తల్లుల ఆవేదనలతో బెర్లిన్ నగరం చిగురుటాకులా వణికిపోయింది.
ఓ పక్క భయం..మరోవైపు ఆవేదన