రేసింగ్ చరిత్రలో డేరియో కోస్టా(Dario Costa) తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. రెండు సొరంగాల లోపల నుంచి విమానాన్ని(aircraft tunnel) నడిపించి.. ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసాన్ని చేశారు.
ఈ ప్రయోగం కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెడ్‌బుల్ రేసింగ్ విమానాన్ని(red bull plane tunnel) ఉపయోగించారు డేరియో. గంటకు 245 కి.మీ వేగంతో విమానాన్ని నడిపిస్తూ.. 43 సెకన్లలోనే 2.2 కి.మీల దూరం ప్రయాణించారు. టర్కీ(turkey tunnel flight) ఇస్తాంబుల్‌లోని శివార్లలో ఈ సాహసం చేశారు.
గిన్నిస్ దాసోహం
ఇరుకైన సొరంగం, విమానం చుట్టుపక్కల మూడు మీటర్లు మించని స్థలం... ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా విమానాన్ని సొరంగం దాటించారు. దీనికి గిన్నిస్ ప్రపంచ రికార్డు లభించింది.