తెలంగాణ

telangana

ETV Bharat / international

'చాలా ప్రమాదకరమైన కాలంలో ప్రపంచం' - who about vaccination

కొవిడ్​ విజృంభణ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచం.. 'చాలా ప్రమాదకరమైన కాలంలో' ఉందని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దాదాపు 100 దేశాల్లో కరోనా డెల్టా వేరియంట్​ను గుర్తించినట్లు చెప్పింది.

tedros, who chief, who
ప్రపంచ ఆరోగ్య సంస్థ, డబ్ల్యూహెచ్​ఓ, టెడ్రోస్​ అథనోమ్​

By

Published : Jul 3, 2021, 4:52 AM IST

కరోనా మహమ్మారి వ్యాప్తి వేళ.. ప్రపంచం 'చాలా ప్రమాదకరమైన కాలం'లో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) చీఫ్‌ టెడ్రోస్ అథనోమ్ వెల్లడించారు. దాదాపు 100 దేశాలలో కరోనా డెల్టా వేరియంట్‌ను గుర్తించారని తెలిపారు. భారత్‌లో మొదటిసారి గుర్తించిన డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. ఇది చాలా దేశాలలో ప్రధాన రకంగా మారిందని చెప్పారు.

టీకాలే దిక్కు..

వచ్చే ఏడాది ఈ సమయానికి కల్లా ప్రతి దేశంలో 70 శాతం మందికి టీకాలు వేసేలా చూడాలని.. అన్ని దేశాల నేతలను తాను కోరానని అథనోమ్​ వెల్లడించారు. కరోనా మహమ్మారి తీవ్రమైన దశను సమర్థంగా అడ్డుకోవాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమన్న అథనోమ్‌.. పేద దేశాలతో టీకాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, కెనడా సహా పలు ధనిక దేశాలు.. పేద దేశాలకు ఒక బిలియన్ కొవిడ్‌ వ్యాక్సిన్లు విరాళంగా ఇస్తామని ప్రతిజ్ఞ చేశాయి.

ఇదీ చూడండి:'అలా చేస్తేనే కరోనాపై విజయం సాధ్యం!'

ఇదీ చూడండి:'రానున్న రోజుల్లో ప్రమాదకారిగా డెల్టా వైరస్'

ABOUT THE AUTHOR

...view details