దక్షిణ ఫ్రాన్స్‌లో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. నీస్ నగరంలో వరద ప్రవాహం కారణంగా.. ఇద్దరు అగ్నిమాపక అధికారులు సహా మొత్తం ఎనిమిది మంది గల్లంతయ్యారు. వీరిని వెతికేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఇందుకోసం 1000 మంది అగ్నిమాపక సిబ్బంది, నాలుగు సైనిక హెలికాప్టర్లు రంగంలోకి దింపారు.
సుమారు ఒక ఏడాదిలో నమోదయ్యే సగటు వర్షపాతం.. కేవలం 12గంటల వ్యవధిలో నమోదైందని అధికారులు పేర్కొన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు, భవనాలు నేలకొరిగాయి. వంతెనలు కూలిపోయాయి. విద్యుత్, సెల్‌ఫోన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.