Covishield Vaccine Protection: ఇతర యూరప్ దేశాలతో పోల్చితే 'కొవిషీల్డ్' వల్లే తమ దేశంలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉందని అన్నారు బ్రిటన్ టీకా నిపుణుడు డా.క్లైవ్ డిక్స్ . కరోనాపై కొవిషీల్డ్ దీర్ఘకాలంగా పనిచేస్తుండటమే దీనికి కారణమని చెప్పారు.
"యూరప్‌లో కేసులు పెరిగే కొద్ది మరణాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. కానీ యూకేలో అలా కాదు. బ్రిటన్‌లో చాలామంది కొవిషీల్డ్ తీసుకున్న కారణంగానే తక్కువ మరణాలు నమోదయ్యాయని నేను విశ్వసిస్తున్నాను."
-డా.క్లైవ్ డిక్స్, యూకే వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ మాజీ ఛైర్మన్
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఓ వెబ్సైట్ ప్రకారం.. బ్రిటన్‌లో ప్రతిరోజు ప్రతి పది లక్షల మందికి సగటు మరణాల రేటు 1.7గా ఉంది. కానీ యూరప్ మరణాల రేటు 4గా నమోదైంది.