Covishield Booster Dose: మూడో డోసుగా కొవిషీల్డ్ తీసుకుంటే ప్రమాదకర ఒమిక్రాన్ వేరియంట్‌ను దీటుగా ఎదుర్కోవచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ మూడో డోసు తర్వాత శరీరంలో బీటా, ఆల్ఫా, డెల్డా, గామా వేరియంట్లను కూడా ఎదుర్కొనే స్థాయికి రోగనిరోధక శక్తి చేరుకుంటుందని తెలిసింది. కొవిషీల్డ్ లేదా ఇతర ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు తీసుకున్నవారిపై ఆస్ట్రాజెనెకా సంస్థ ఈ పరిశోధనలు జరిపింది.
ఆ వ్యాక్సిన్ మూడో డోసుతో ఒమిక్రాన్‌కు చెక్! - కొవిషీల్డ్ బూస్టర్ డోసు
Covishield Booster Dose: కొవిషీల్డ్ మూడో డోసుతో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే విధంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగతుందని ఆ వ్యాక్సిన్ రూపకర్త ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. కొవిషీల్డ్ లేదా ఇతర ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు తీసుకున్న వారిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు తెలిసినట్లు పేర్కొంది.
ఒమిక్రాన్
ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో కొవిషీల్డ్ మూడో డోసును అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ క్రమంలో జరిపిన పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. ఒమిక్రాన్‌ను మరింత దీటుగా ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ను తయారు చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి :రూ.8కోట్లు ఖర్చు.. కరోనాపై 8 నెలల పోరాటం.. అయినా దక్కని రైతు ప్రాణం!