కరోనా వల్ల మానవుల ఆయుర్దాయం (Life Expectancy in 2020) భారీగా పడిపోయిందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో (Oxford life expectancy study) వెల్లడైంది. ఈ స్థాయిలో ఆయుర్దాయం పడిపోవడం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే తొలిసారని ఆక్స్ఫర్డ్ బృందం తెలిపింది. (Life Expectancy Covid) ఏన్నో ఏళ్లుగా చేస్తున్న కృషిని కరోనా తుడిచిపెట్టేసిందని పేర్కొంది.
29 దేశాల్లో సంభవించిన మరణాల సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ధరణకు వచ్చారు ఆక్స్ఫర్డ్ (University of Oxford) పరిశోధకులు. ఐరోపా, అమెరికా, చిలీ దేశాల డేటాను వినియోగించారు. ఇందులో భాగంగా 2020లో 27 దేశాల్లో ఆయుర్దాయం తగ్గిపోయిందని తేల్చారు.
"15 దేశాల్లోని మహిళలు, 10 దేశాల్లోని పురుషులకు 2015తో పోలిస్తే 2020లో ఆయుర్దాయం తగ్గింది. ఫ్లూ కారణంగా 2015లోనూ ఆయుర్దాయంపై ప్రతికూల ప్రభావం ఉంది. స్పెయిన్, ఇంగ్లాండ్- వేల్స్, ఇటలీ, బెల్జియం వంటి పశ్చిమ ఐరోపా దేశాల్లో చివరిసారి ఒక ఏడాదిలో ఈ స్థాయిలో ఆయుర్దాయం పడిపోయింది రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే."
-జోస్ మాన్యుయెల్ అబుర్టో, లివర్హమ్ సెంటర్ ఫర్ డెమొగ్రాఫిక్ సైన్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ
అధ్యయనం ముఖ్యంశాలు
- ఆయుర్దాయంలో మార్పులు అన్ని దేశాల్లో ఒకేలా లేవు.
- 22 దేశాల్లోని ప్రజలు సగటున ఆరు నెలల ఆయుర్దాయాన్ని కోల్పోయారు.
- 8 దేశాల్లోని మహిళలు, 11 దేశాల్లోని పురుషులు ఏడాదికి పైగా జీవితకాలాన్ని నష్టపోయారు.
- ఏడాది ఆయుర్దాయాన్ని పెంచడానికి ఈ దేశాలకు సగటున 5.6 సంవత్సరాల సమయం పట్టింది.
- అధ్యయనం నిర్వహించిన మొత్తం 29 దేశాల్లో పురుషుల ఆయుర్దాయం మహిళలతో పోలిస్తే తగ్గిపోయింది.
- అత్యధికంగా అమెరికాలో పురుషుల ఆయుర్దాయం 2019తో పోలిస్తే 2.2 ఏళ్లు తగ్గింది. లూథియేనియాలో 1.7 ఏళ్ల ఆయుష్షును పురుషులు కోల్పోయారు.