తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా కరోనాకు 40 లక్షల మంది బలి

ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా సంభవించిన మరణాలకు సంబంధించిన లెక్కలను అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ విడుదల చేసింది. ఇప్పటివరకూ 40లక్షల మందిని వైరస్​ బలితీసుకోగా.. చనిపోయిన ముగ్గురిలో ఒకరు భారత్‌ నుంచే ఉన్నట్లు అంచనా వేసింది.

Covid death toll surpasses 4 mn globally: Reuters
ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మందిని బలితీసుకున్న కరోనా

By

Published : Jun 18, 2021, 1:20 PM IST

Updated : Jun 18, 2021, 7:05 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరణమృంగం మోగించిన వేళ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్‌ ఆందోళనకర గణాంకాలను బయటపెట్టింది. వైరస్‌ సంబంధిత కారణాలతో చనిపోయిన వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మైలురాయిని చేరుకున్నట్లు వెల్లడించింది. 20లక్షల మరణాల నమోదుకు ఏడాది కాలం పట్టిందన్న రాయిటర్స్‌.. మరో 20లక్షలు చేరుకునేందుకు కేవలం 166 రోజుల సమయం మాత్రమే పట్టిందని పేర్కొంది.

అమెరికా, బ్రెజిల్‌, భారత్‌, రష్యా, మెక్సికో దేశాల్లోనే 50శాతం కరోనా సంబంధిత మరణాలు నమోదైనట్లు చెప్పింది. అటు భారత్‌, బ్రెజిల్‌ దేశాల్లో ప్రతి రోజు గరిష్ఠ మరణాలు నమోదవుతున్నట్లు తెలిపింది. చనిపోయిన ముగ్గురిలో ఒకరు భారత్‌ నుంచే ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు సరిపడ టీకాలు సమకూర్చుకునేందుకు చాలా దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు రాయిటర్స్‌ తన అధ్యయనంలో పేర్కొంది.

డెల్టా వేరియంట్​ కలవరం

బ్రిటన్​లో డెల్టా వేరియంట్ పంజా విసురుతోంది. వారం రోజుల్లోనే 33,630 మందికి ఈ రకం కరోనా సోకినట్లు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 75, 953కి చేరినట్లు వెల్లడించింది. కొత్త కేసుల్లో 99 శాతం డెల్టా వేరియంట్​ కేసులే ఉంటున్నాయని పేర్కొంది.

బ్రిటన్​లో గుర్తించిన ఆల్ఫా వేరియంట్​తో పోల్చితే తొలుత భారత్​లో గుర్తించిన డెల్టా వేరియంట్ కారణంగా బాధితులు ఆస్పత్రిలో చేరే ముప్పు పెరిగినట్లు అధికారులు చెప్పారు. అయితే టీకా రెండు డోసులు తీసుకుంటే ఈ రకం కరోనా నుంచి 90 శాతం రక్షణ లభిస్తున్నట్లు స్పష్టం చేశారు. బాధితుల్లో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోని వారే ఉన్నారని, కొంత మంది సింగిల్ డోసు మాత్రమే తీసుకున్నారని వివరించారు. అందరూ వ్యాక్సిన్ తీసుకుంటే మహమ్మారి ముప్పు తప్పుతుందని పేర్కొన్నారు.

అయితే ఇతర వేరియంట్లతో పోల్చితే డెల్టా కారణంగా మరణాలు ఎక్కువగా సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. ఒక్క సారి కరోనా సోకిన వారికి మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువేనని వెల్లడించారు. కేవలం 0.4 శాతం మందే రెండోసారి వైరస్ బారినపడినట్లు అధ్యయనంలో తేలినట్లు ప్రకటించారు.

ఇవీ చదవండి:లెక్కకు మించిన మరణాలు.. రాష్ట్రాల సవరణలే సాక్ష్యాలు!

మే నెలలో మృత్యు ఘంటికలు.. రోజుకు 749 మంది!

అక్కడ 6 లక్షలు దాటిన కరోనా మరణాలు

Last Updated : Jun 18, 2021, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details