తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా యోధుల్లో యాంటీబాడీలు ఎంత కాలం  ఉంటాయంటే..

కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు 9 నెలలు పాటు కొనసాగుతాయని పరిశోధకులు వెల్లడించారు. ఇన్​ఫెక్షన్ సమయంలో వారిలో వ్యాధి లక్షణాలు ఉన్నా.. లేకున్నా.. యాంటీబాడీలు అంత సమయం పాటు మనుగడలో ఉంటాయని పేర్కొన్నారు.

research on covid antibodies, కరోనా యాంటీబాడీలు
కనీసం 9 నెలల పాటు యాంటిబాడీలు

By

Published : Jul 20, 2021, 7:24 AM IST

కొవిడ్​-19 ఇన్​ఫెక్షన్​ నుంచి కోలుకున్న వ్యక్తుల్లో యాంటీబాడీలు 9 నెలల పాటు కొనసాగుతాయని తాజా అధ్యయనం తేల్చింది. ఇన్​ఫెక్షన్ సమయంలో వారిలో వ్యాధి లక్షణాలు ఉన్నా.. లేకున్నా.. యాంటీబాడీలు అంత సమయం పాటు మనుగడలో ఉంటాయని గుర్తించింది. బ్రిటన్​లోని ఇంపీరియల్​ కాలేజీ లండన్, ఇటలీలోని పాడువా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

గతేడాది ఇటలీలోని వో పట్టణానికి చెందిన వారిపై ఈ పరిశోధనలు జరిపారు. కొవిడ్​ సోకిన వారికి తొలిసారి ఫిబ్రవరి, మార్చి నెలల్లో పరీక్షలు నిర్వహించారు. మళ్లీ మే, నవంబరు నెలల్లో వారికి పరీక్షలు జరిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పరీక్షలు జరిపిన వారిలో 98.8 శాతం మందికి నవంబరు నాటికి కూడా యాంటీబాడీలు కొనసాగుతున్నట్లు గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. అయితే పలువురిలో ఈ యాంటీబాడీల స్థాయి తగ్గినట్లు గుర్తించామన్నారు.

ఇదీ చదవండి :ఆ దేశంలో వయోజనులందరికి వ్యాక్సిన్ పూర్తి!

ABOUT THE AUTHOR

...view details