తెలంగాణ

telangana

ETV Bharat / international

వాసనతో కరోనాను పసిగట్టే సాధనం! - కరోనా వాసనను పసిగట్టేందుకు పరికరం

కొవిడ్​ సోకిన వ్యక్తి నుంచి వచ్చే వాసనను పసిగట్టే ఒక సాధనాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి కరోనా అలారం అని పేరు పెట్టారు.

covid alarm developed by britain scientists
వాసన చూసి.. కరోనాను పసిగడుతుంది!

By

Published : Jun 14, 2021, 7:11 AM IST

రద్దీగా ఉన్న ప్రాంతంలో.. కొవిడ్-19 సోకిన వ్యక్తిని అక్కడిక్కడే పసిగట్టే ఒక సాధనాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సదరు వ్యక్తి శరీరం నుంచి వెలువడే వాసనను ఇది విశ్లేషించి, ఈ నిర్ధరణ చేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ సాధనానికి 'కొవిడ్ అలారం' అని పేరు పెట్టారు.

కరోనా బాధితుల నుంచి ఒకింత విభిన్నమైన వాసన వస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చారు. వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్(వీఓసీ)లో మార్పులే ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు. వీరిలో ప్రధానంగా కీటోన్, ఆల్డిహైడ్​కు సంబంధించిన పదార్థాలు ఉంటాయని వివరించారు. వాసనపరంగా వాటికి ప్రత్యేక ముద్ర ఉంటుందని చెప్పారు. దీన్ని పసిగట్టేందుకు ఎల్​ఎస్​హెచ్​టీఎం, రోబోసైంటిఫిక్ లిమిటెడ్, దర్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.. ఆర్గానిక్ సెమీ కండక్టింగ్ సెన్సర్లతో ఒక సాధనాన్ని రూపొందించారు.

ఇవీ చదవండి:వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌.. భవిష్యత్‌లో ఎలా ఉండొచ్చు?

ABOUT THE AUTHOR

...view details