తెలంగాణ

telangana

ETV Bharat / international

వ్యాక్సినేషన్​ ప్రక్రియకు ఐరోపా దేశాలు సిద్ధం!

కరోనాకు వ్యాక్సిన్​ను​ అందించేందుకు ఐరోపా దేశాలు సన్నద్ధమయ్యాయి. ఈ మేరకు ఫైజర్​, బయోఎన్​టెక్​ కంపెనీలు అభివృద్ధి చేసిన టీకాలను ఆయా దేశాలు దిగుమతి చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే వ్యాక్సిన్​ చేరగా.. స్లోవేకియాలో శనివారం సాయంత్రమే టీకా అందించారు అధికారులు. స్పానిష్​లో ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

By

Published : Dec 27, 2020, 9:29 AM IST

COVID-19 vaccine shipments arrive across EU before rollout
వ్యాక్సినేషన్​ ప్రక్రియకు ఐరోపా దేశాలు సిద్ధం!

ఐరోపా దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ డోసులు.. బెల్జియంలోని తయారీ కేంద్రం నుంచి ఆయా దేశాలకు చేరుకున్నాయి. నిర్దేశించిన గిడ్డంగులకు ఇప్పటికే ట్రక్కుల ద్వారా టీకాలను తరలించించాయి ఫార్మా సంస్థలు. ఆదివారం మరికొన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్‌లు చేరుకోనున్నాయి.

వ్యాక్సినేషన్​ ప్రక్రియకు ఐరోపా దేశాలు సిద్ధం!

ఈ నేపథ్యంలో ఆదివారం నుంచే టీకా ప్రక్రియను ప్రారంభించేందుకు ఐరోపా దేశాలు సిద్ధమవుతున్నాయి. ఫ్రాన్స్‌లో టీకా ప్రక్రియలో వృద్ధులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. మరోవైపు.. జర్మనీ కూడా తొలి దశలో 80 ఏళ్లకు పైబడిన వారితో పాటు.. ప్రాధాన్యం ఉన్న వర్గాలకు ప్రాముఖ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. స్పానిష్‌కు శనివారం టీకాలు చేరగా.. ఈ ఉదయం నుంచే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్లొవేకియాలో..

స్లొవేకియాలో శనివారం సాయంత్రం తొలి దశ టీకా మోతాదును అందించారు అధికారులు. ఈ మేరకు అంటువ్యాధుల నిపుణులు వ్లాదిమర్​ క్రిక్మెరీ వ్యాక్సిన్​ తీసుకున్న మొదిటి వ్యక్తిగా నిలిచారు. ఈ వ్యాక్సినేషన్​ ప్రక్రియను అక్కడి వైద్యసిబ్బంది దగ్గరుండి పర్యవేక్షించారు.

స్పానిష్​లో..

స్పానిష్​లో ఓ నర్సింగ్​ హోమ్​లో ఆదివారం కొవిడ్​-19 టీకా ప్రక్రియ చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. బెల్జియం నుంచి ఫైజర్​-బయెఎన్​టెక్​ వ్యాక్సిన్​లు ఇప్పటికే తమ దేశానికి చేరినట్టు వారు తెలిపారు. ఆ దేశంలో తొలివిడతలో భాగంగా.. వారానికి సగటున 3.5 లక్షల డోసుల వ్యాక్సిన్​ను అందిస్తున్నట్టు తెలుస్తోంది.

ఐరోపా దేశాల్లో ఇప్పటివరకు కోటి 10 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా.. 3 లక్షల 36వేల మంది మృత్యువాతపడ్డారు.

ఇదీ చదవండి:మోడెర్నా టీకాతో అమెరికా వైద్యుడికి తీవ్ర అలర్జీ!

ABOUT THE AUTHOR

...view details