కరోనా వైరస్.. ఫ్లూ కంటే నెమ్మదిగా వ్యాపిస్తుంది కానీ ఫ్లూకంటే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రొస్ కరోనా గురించి పలు విషయాలు వెల్లడించారు. కరోనా అన్ని వ్యాధుల్లాంటిది కాదని.. విచిత్ర లక్షణాలున్న వైరస్ అని తెలిపారు.
"ప్రపంచ వ్యాప్తంగా సేకరించిన గణాంకాల ఆధారంగా వ్యాధిని అంచనా వేస్తున్నాం. వైరస్ ఫ్లూకంటే నెమ్మదిగా వ్యాపిస్తున్నప్పటికీ ఇది చాలా ప్రమాదకరం. ఆరోగ్యంగా ఉన్నవారిని ఎక్కువగా ప్రభావితం చేయలేదు. కరోనా అన్ని వ్యాధుల్లాంటిది కాదు. విచిత్రమైన లక్షణాలున్న వైరస్ ఇది. కరోనా కేసుల్లో కేవలం ఒకశాతం రోగుల్లో మాత్రం లక్షణాలు కనిపించడం లేదు. కానీ, రెండు రోజుల్లోనే వేగంగా వృద్ధి చెందుతున్నాయి. వ్యాధిని నయం చేయడానికి ఇప్పటి వరకూ టీకాలు కానీ.. చికిత్స విధానం కానీ కనుగొనలేదు. మన జాగ్రత్తతోనే వైరస్ నుంచి దూరంగా ఉండగలం."