గుండె రుగ్మతలున్న కొవిడ్-19 బాధితులు ఆసుపత్రి పాలైనప్పుడు వారి పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వైరస్‌తో వీరికి మరణం ముప్పు ఎక్కువని కూడా తేలింది. ఇటలీలోని మ్యాగ్నా గ్రేషియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం సాగించారు.
కొవిడ్ బాధితుల్లో చాలా మందికి స్వల్ప అస్వస్థత మాత్రమే కలుగుతుంది. మిగతావారిలో అది తీవ్ర న్యుమోనియా.. మరికొందరిలో మరణానికి దారితీయవచ్చు. దీనిపై పరిశోధకులు దృష్టిసారించారు. ఇందులో భాగంగా.. ఆసియా, ఐరోపా, అమెరికాలో కొవిడ్‌తో ఆసుపత్రిపాలైన 77,317 మందికి సంబంధించి ప్రచురితమైన డేటాను విశ్లేషించారు.