తెలంగాణ

telangana

ETV Bharat / international

'65 ఏళ్లపైవారిలో రీఇన్​ఫెక్షన్ ముప్పు ఎక్కువ' - covid-19 virus reinfection

మిగతా వయసువారితో పోలిస్తే 65 ఏళ్లు పైబడినవారు మరోసారి కొవిడ్-19 ఇన్​ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉందని డెన్మార్క్​ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది. 65 ఏళ్లు లోపువారికి రీఇన్​ఫిక్షన్ ముప్పు నుంచి దాదాపు 80 శాతం మేర రక్షణ లభిస్తోందని డెన్మార్క్​ శాస్త్రవేత్తలు వివరించారు.

COVID-19 patients above 65 years of age more prone to reinfection, says study
'65ఏళ్లపైవారిలో రీఇన్​ఫెక్షన్ ముప్పు ఎక్కువ'

By

Published : Mar 20, 2021, 5:41 AM IST

యువత, నడివయసువారితో పోలిస్తే 65ఏళ్లు పైబడినవారికి కరోనా ఇన్​ఫెక్షన్ మరోసారి తలెత్తే ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది. డెన్మార్క్​లోని స్టాటెన్స్ సీరం ఇన్​స్టిట్యూట్ ఈ పరిశోధన చేసింది. ఒకసారి కొవిడ్-19 బారినపడిన వారికి రెండోసారి ఆ ఇన్​ఫెక్షన్​ రాకుండా కనీసం కొన్ని నెలలు రక్షణ లభించొచ్చన్న అంచనాలు ఉన్నాయి. 65 ఏళ్లు లోపువారికి రీఇన్​ఫిక్షన్ ముప్పు నుంచి దాదాపు 80 శాతం మేర రక్షణ లభిస్తోందని డెన్మార్క్​ శాస్త్రవేత్తలు వివరించారు.

65ఏళ్లు పైబడిన వారిలో ఆ రక్షణ 47 శాతమే ఉంటోందని పేర్కొన్నారు. దీన్నిబట్టి వారు తిరిగి కొవిడ్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపారు. కాబట్టి గతంలో ఒకసారి కరోనా బారినపడిన వారు కూడా టీకాను పొందాలని పరిశోధకులు సూచించారు.

ఇదీ చదవండి :కరోనా విజృంభణపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ABOUT THE AUTHOR

...view details