కరోనా మహమ్మారిని ప్రపంచం రెండేళ్లలోనే అంతమొందిస్తుందని అభిప్రాయపడ్డారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్. ఈ మహమ్మారి మనకు ఆరోగ్యం, ఆర్థిక పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పింది అని ఆయన ఉటంకించారు. కరోనా మహమ్మారి శతాబ్దానికి ఒక్కసారి వచ్చే మహమ్మారే కావచ్చు కానీ, మన ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా, పరిశుభ్రంగా మార్చుకునేందుకు శతాబ్దానికి ఓ సారి వచ్చే అవకాశంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు.
1918 నాటి స్పానిష్ ఫ్లూ అంతమొందడానికి రెండేళ్లు పట్టింది కానీ, కరోనా అంతకన్నా తక్కువ సమయంలోనే అంతమవుతుందన్నారు టెడ్రోస్.