ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న క్రమంలో ముఖ్యమైన ఔషధాలు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా విషయంలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసేందుకు.. జీ-20 దేశాల వాణిజ్య, పెట్టుబడి శాఖ మంత్రులు అంగీకరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహంచిన చర్చల అనంతరం ఈమేరకు సంయుక్త ప్రకటన చేశారు. అవసరమైన వైద్య సామగ్రి తక్కువ ధరకు అందేలా చర్యలు చేపట్టాలని ఈ సదస్సులో తీర్మానించారు.
కరోనా మహమ్మారిపై వ్యక్తిగతంగా, సమష్టిగా పోరాడుతూనే.. అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులపై ఆ ప్రభావం పడకుండా ప్రయత్నం చేస్తాం. సుస్థిరమైన వాణిజ్యం, పెట్టుబడి వాతావరణాన్ని అందించేందుకు కలిసి పని చేస్తాం. మార్కెట్లనూ తెరిచి ఉంచేలా చూస్తాం.