తెలంగాణ

telangana

ETV Bharat / international

లాక్​డౌన్​ ఎత్తివేత ఒత్తిడిలో ప్రపంచ దేశాలు - virus restrictions

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన కఠిన ఆంక్షలను పలు దేశాలు సడలిస్తున్నాయి. కేసుల సంఖ్య తగ్గిన కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అనుమతిస్తున్నాయి. ప్రజలు సాధారణ జీవనాన్ని కోరుకోవడం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనే ఒత్తిడితో ఈ మేరకు చర్యలు చేపడుతున్నాయి. ఆంక్షలు సడలించామని ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇన్నాళ్ల శ్రమ వృథా అవుతుందని దక్షిణ కొరియా హెచ్చరించింది. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించింది.

virus-restrictions
లాక్​డౌన్​ ఎత్తివేత ఒత్తిడిలో ప్రపంచ దేశాలు

By

Published : Apr 13, 2020, 4:08 PM IST

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్​డౌన్​, కర్ఫ్యూ వంటి కఠిన అంక్షలను విధించాయి ప్రపంచ దేశాలు. పలు దేశాల్లో ఇప్పుడు వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో నిబంధనలను సడలించాలని భావిస్తున్నాయి. కొన్ని వారాల పాటు గడప దాటని ప్రజలు సాధారణ జీవితాన్ని కోరుకోవడం, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వస్తున్నాయి.

దక్షిణ కొరియాలో..

కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ప్రజలు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని దక్షిణ కొరియా అధికారులు హెచ్చరిస్తున్నారు. బార్​లలో, ఇతర రద్దీ ప్రాంతాల్లో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. అలా చేయకపోతే వైరస్ కట్టిడికి ఇన్ని రోజలు చేసిన ప్రయత్నం వృథా అవుతుందన్నారు.

మార్చి మొదట్లో దక్షిణ కొరియాలో కేసులు విపరీతంగా నమోదయ్యాయి. ఇప్పుడు తగ్గాయి. రోజుకు దాదాపు 500కు మించి కేసులు నమోదు కావడం లేదు.

ఐరోపా దేశాల్లో..

కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది ఐరోపా దేశాలే. స్పెయిన్​లో గత మూడు వారాల్లో ఆదివారమే తక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పలు పరిశ్రమలు, నిర్మాణ పనులకు అనుమతిచ్చింది ప్రభుత్వం.

వెలవెలబోయిన చర్చిలు...

ఈస్టర్ పర్వదినాన ఎప్పుడూ కిటకిటలాడే చర్చిలు ఈ సారి బోసిపోయాయి. ప్రజలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకున్నారు. వాటికన్​ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద రద్దీకి అకవాశం లేకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఫ్లోరిడాలోని ఓ చర్చికి మాత్రం జనం భారీగా తరలివచ్చారు. అందరూ కార్లలోనే ప్రార్థనలు నిర్వహించారు. పార్కింగ్ స్థలం నిండిపోయింది.

అమెరికాలో..

కొవిడ్-19పై పోరాడుతున్న వైద్య, ఇతర సహాయ సిబ్బందికి ఈస్టర్​ డే సందేశంలో భాగంగా కృతజ్ఞతలు చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ వారాంతంలో లాక్​డౌన్ ఆంక్షలు సడలించే అవకాశం ఉందని తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా గురించి వారికి ఇంకా తెలియదట!

ABOUT THE AUTHOR

...view details