కరోనా మహమ్మారి ధాటికి ఇటలీ తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే చైనాను ధాటి కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో రోగులకు వైద్యం అందించేందుకు ఆ దేశం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. వైద్య పరికరాలు సరిపోవడం లేదు. శ్వాస పరికరాలు పనిచేసేందుకు అవసరమైన వాల్వులు అందుబాటులో లేవు. ధర కూడా చాలా ఎక్కువ.
ఒక్క డాలర్‌కే 3డీ కృత్రిమ శ్వాస పరికరాలు - బ్రెస్సియా
కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ శ్వాస అందించే వాల్వ్‌ల కొరత ఏర్పడింది. ఉన్నా వాటి ధర కూడా సామాన్యులకు ఏ మాత్రం అందుబాటులో లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరు ఔత్సాహికులు 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా కృత్రిమ వాల్వ్‌లను రూపొందించారు. అది కూడా కేవలం ఒక్క డాలరు ఖర్చుతోనే. ఇది కరోనా రోగుల పాలిట సైన్స్ ఫిక్షన్ లాంటి అద్భుతం.
ఇటలీలో రోగులను కాపాడేందుకు భౌతికశాస్త్ర నిపుణుడు మాసిమో టెంపోరెల్లి ముందుకొచ్చారు. త్రీడీ ప్రింటర్లను ఉపయోగించి వాల్వ్‌లను ముద్రించాలని నిర్ణయించారు. అయితే... ఇందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. వాల్వుల తయారీ రంగంలోని ఓ దిగ్గజ సంస్థ... పేటెంట్ హక్కుల ఉల్లంఘన కింద కేసు వేస్తానని మాసిమోను హెచ్చరించింది. అయినా... ఆయన వెనుకడుగు వేయలేదు. ఈ త్రీడీ మోడల్‌ను రూపొందించడానికి ఎఫ్‌డీఎం, ఎస్ఎల్ఎస్, ఎస్ఎల్ఏ అనే మూడు వేర్వేరు పద్ధతులను ఉపయోగించారు. ఎట్టకేలకు విజయం సాధించారు. 11 వేల డాలర్లు ఖరీదు చేసే వాల్వును... త్రీడీ ప్రింటింగ్ ద్వారా ఒకే ఒక్క డాలరు ఖర్చుతో రూపొందించారు.
ఇదీ చదవండి: ఉప్పు ఎక్కువ తింటే కరోనా వచ్చే ముప్పు
!