తెలంగాణ

telangana

ETV Bharat / international

'పేద కుటుంబాల్లోని చిన్నారుల సంఖ్య 67.2 కోట్లు!' - యునిసెఫ్ తాజా నివేదిక

కరోనా ప్రభావంతో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పేదరికం గణనీయంగా పెరగనుందని యునిసెఫ్​, సేవ్​ ది చిల్డ్రన్ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా 8.6 కోట్ల మంది పిల్లలు పేదరికంలో మగ్గిపోనున్నారని అంచనా వేసింది.

Coronavirus pandemic
పేదరికం

By

Published : May 28, 2020, 1:59 PM IST

కరోనా మహమ్మారితో ఆర్థిక పతనం కారణంగా దిగువ, మధ్య ఆదాయ దేశాలలో పేద గృహాల్లోని పిల్లల సంఖ్య 2020 చివరినాటికి 8.6 కోట్లు పెరుగుతుందని ఓ అధ్యయనం తెలిపింది. వీరితో కలిపి మొత్తం పేదరికంలో ఉన్న పిల్లల సంఖ్య 67.2 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

ఐరాస అనుబంధ సంస్థ యునిసెఫ్, సేవ్​ ది చిల్డ్రన్​ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

"కరోనా ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా 8.6 కోట్ల మంది చిన్నారులు ఉన్న కుటుంబాలు పేదరికంలోకి వెళ్లనున్నాయి. గతంతో పోలిస్తే ఇది 15 శాతం పెరుగుదల. తక్షణం స్పందించి సరైన చర్యలు తీసుకోకపోతే వీరి సంఖ్య మొత్తం 67.2 కోట్లకు చేరుతుంది."

- నివేదిక సారాంశం

ఈ దేశాల్లో..

వీరిలో రెండొంతుల చిన్నారులు ఉత్తర ఆఫ్రికా, దక్షిణాసియా, ఐరోపా, మధ్య ఆసియా దేశాల్లోనే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఐరోపా, మధ్య ఆసియాల్లో వీరి సంఖ్య గణనీయంగా 44 శాతం పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతంలో 22 శాతం పెరుగుదల ఉంటుందని తెలిపింది.

ప్రభుత్వాలు చేయూతనివ్వాలి..

ఆర్థిక పతనం కారణంగా పిల్లలకు పోషకాహారం, విద్య, వైద్య సదుపాయాలు అందవని ఈ నివేదిక హెచ్చరించింది. బాల్య వివాహాలు, హింస, దోపిడి పెరిగే అవకాశం ఉందని నివేదించింది. జీవితకాలం ఈ చిన్నారులపై ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది.

"ఆర్థిక ఉద్దీపన చర్యలే కాకుండా సామాజిక భద్రత, ఉద్యోగాలు, కార్మిక విపణిలో జోక్యం వంటి చర్యలు తీసుకోవాలి. కుటుంబ పోషణకు మద్దతివ్వాలి. వైద్య ఆరోగ్య వ్యవస్థతోపాటు ఇతర సేవల నాణ్యత పెంచాలి. కుటుంబ విధానాలను ప్రోత్సహించేలా పెట్టుబడులకు అవకాశం కల్పించాలి."

- నివేదిక

ABOUT THE AUTHOR

...view details