తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్‌ బాధితుల మెదడుకు ముప్పు!

కరోనా వల్ల మెదడుకు హాని కలిగే అవకాశం ఉందని స్వీడన్​ గోతెన్​బర్గ్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. ఓ మోస్తరు నుంచి అధికంగా ఉన్న వారి రక్తంలో మెదడుకు హాని కలిగినప్పుడు విడుదలయ్యే రెండు రకాల ప్రొటీన్లను గుర్తించినట్లు వెల్లడించారు.

Coronavirus may infect respiratory centre of brain, suggests research
కొవిడ్‌ బాధితుల మెదడుకు ముప్పు!

By

Published : Jun 20, 2020, 11:08 AM IST

కొవిడ్‌ బాధితుల మెదడుకు హాని కలిగే ముప్పు ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్‌ యూనివర్సిటీ పరిశోధకులు... మహమ్మారితో బాధపడుతున్న పలువురి రక్త నమూనాలను పరీక్షించారు. వైరస్‌ లోడు ఓ మోస్తరు నుంచి అధికంగా ఉన్నవారి రక్తంలో... గ్లియాల్‌ ఫిబ్రిలరీ యాసిడ్‌ ప్రొటీన్‌, న్యూరోఫ్లామెంట్‌ లైట్‌ చైన్‌ ప్రొటీన్‌లు ఉన్నట్టు వారు గుర్తించారు. నిజానికి ఈ రెండూ మెదడులోని ఆస్ట్రోసైట్‌, మరో రకం నాడీ కణాల్లో ఉంటాయి. ఇవి దెబ్బతిన్నప్పుడు వాటిలోంచి ఈ రెండు ప్రొటీన్లు స్రవించి, రక్తంలో కలుస్తాయి.

రక్తంలో వీటి ఉనికి ఉన్నవారి మెదళ్ల పనితీరులో లోపం కనిపిస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు. వెంటిలేటర్‌ ట్రీట్‌మెంట్‌ అవసరమయ్యే చాలామంది రక్తంలో ఎన్‌ఎఫ్‌ఎల్‌ ఉంటోందనీ, ఈ ప్రొటీన్‌ స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే కొవిడ్‌-19 తీవ్రత అంతగా ఉంటోందనీ గుర్తించారు.

ఇదీ చూడండి:చమురు బావిలో ఇప్పటికీ ఎగిసిపడుతున్న మంటలు

ABOUT THE AUTHOR

...view details